SHIVA BALAKRISHNA: శివ బాలకృష్ణ కేసు.. కేటీఆర్‌ మెడకు చుట్టుకోనుందా..?

శివబాలకృష్ణ వ్యవహారం.. తెలంగాణలో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. చాలా మంది ప్రముఖ నేతలకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయ్. బాలకృష్ణ అరెస్ట్‌తో అతని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2024 | 06:36 PMLast Updated on: Jan 30, 2024 | 6:36 PM

Shiva Balakrishna Arrested By Acb Any Links With Ex Minitster Ktr

SHIVA BALAKRISHNA: హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఓ ప్రభుత్వ అధికారి అయి ఉండి.. దాదాపు 5వందల కోట్లకు పైగా అవినీతికి పాల్పడి.. అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు ఏకంగా అతని జాబ్‌కే ఎసరు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో హెచ్‌ఎండీఏలో అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించిన శివబాలకృష్ణ వ్యవహారం.. తెలంగాణలో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు.

KUMARI AUNTY: వైరల్ కుమారి అంటీపై కేసు.. అరెస్ట్‌..

చాలా మంది ప్రముఖ నేతలకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయ్. బాలకృష్ణ అరెస్ట్‌తో అతని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు చేశాడని.. భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా సొంతానికి రాసుకున్నాడని.. రాజకీయ నేతలకు కావాల్సినట్లుగా వ్యవహరించడం వంటివి చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. పైగా చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా చూపించి.. భారీగా లంచం డిమాండ్ చేశాడన్న విమర్శలు ఉన్నాయ్. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున భూమి ఉన్నట్లుగా బయటపడింది. బాలకృష్ణ.. రెరా సెక్రెటరీగా ఉన్న టైమ్‌లోనే సోమేష్ కుమార్ ఛైర్మన్‌గా ఉన్నారు. అప్పుడే 25 ఎకరాలు సోమేష్ భార్య పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ఈ భూమికి సంబంధి ఆధారాలను ఏసీబీ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సరైన పద్ధతిలోనే భూమిని కొనుగోలు చేసినట్లు సోమేష్ కుమార్ చెప్తున్నారు. తనకున్న ఇల్లు అమ్మి స్థలం కొనుగోలు చేశానని అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఈ కేసు త్వరలో కేటీఆర్ వద్దకు చేరుతుందనే చర్చ జరుగుతోంది. కేటీఆర్‌కు తెలియకుండా హెచ్‌ఎండీలో ఎలాంటి అనుమతులు రావడం.. ఫైల్స్ కదలడం వంటివి జరిగేవి కాదని అంటున్నారు. మొత్తంగా శివబాలకృష్ణ కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారే చాన్స్ కనిపిస్తోంది.