BRS MLA’S: బీఆర్ఎస్‌కు షాక్..! బీజేపీలోకి 10మంది BRS ఎమ్మెల్యేలు
సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందే బీఆర్ఎస్‌కు చెందిన 10మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బీజేపీతో టచ్‌లోకి వెళ్ళారు ఆ పది మంది. బెంగళూరులో బీజేపీకి చెందిన ఓ కీలకనేతతో మీటింగ్ కూడా జరిగినట్టు తెలిసింది.
BRS MLA’S: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ పరం అవుతున్నాయి. బీఆర్ఎస్ సెకండ్ కేడర్ అంతా హస్తం పార్టీలోకి జంప్ అవుతోంది. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికి 10మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లోకి వెళ్ళడం సంచలనంగా మారింది. బెంగళూరులో బీజేపీ పెద్ద లీడర్‌తో ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళి మంతనాలు జరిపి వచ్చినట్టు చెబుతున్నారు.
బీఆర్ఎస్‌కు తెలంగాణలో మరో షాక్ తగలబోతోంది. ఇప్పటికే సెకండ్ కేడర్ అంతా కారు నుంచి దిగిపోతున్నారు. చాలా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఛైర్ పర్సన్లు, వైస్‌ల మీద అవిశ్వాన తీర్మానాలు పెడుతున్నారు. కౌన్సిలర్లంతా అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందే బీఆర్ఎస్‌కు చెందిన 10మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బీజేపీతో టచ్‌లోకి వెళ్ళారు ఆ పది మంది. బెంగళూరులో బీజేపీకి చెందిన ఓ కీలకనేతతో మీటింగ్ కూడా జరిగినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఇద్దరు BRS ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు చెబుతున్నారు.
Janasena Target : జనసేన టార్గెట్ టెన్ వీళ్లే ! ఓడించి తీరాలని కసితో ఉన్నారు !!
ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్. కానీ ఈ పది మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్ళకుండా బీజేపీలో చేరతామని ప్రపోజల్స్ పంపడం ఏంటి అంటే.. వీళ్ళల్లో చాలామందిపై ఆర్థికపరమైన కేసులు ఉన్నాయి. వాటిని మాఫీ చేసుకోడానికే కమలం పార్టీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి రాబోతుందని టాక్స్ నడుస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే తమపై ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిగే అవకాశం ఉంటుందని వీళ్లు భయపడుతున్నారు. ఇబ్బందులు తప్పవని గ్రహించిన ఈ పది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు.. ముందే బీజేపీలో చేరితే బెటర్ అని భావిస్తున్నారట. అయితే బీజేపీ పెద్దలు మాత్రం.. ఇప్పటికప్పుడు బీఆర్ఎస్ ఎమ్మల్యేలను చేర్చుకోవడంపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాళ్ళని ఎప్పుడు చేర్చుకోవాలి.. ఏ రకంగా చేర్చుకోవాలి.. లాంటి ఇష్యూస్‌పై నిర్ణయాన్ని లోక్‌సభ ఎన్నికల తర్వాతే తీసుకోవాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అప్పటి సమీకరణాలబట్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300 స్థానాలు గెలుచుకొని.. ఏ పార్టీతో అవసరం లేకుండా కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడే బీఆర్ఎస్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ 10మంది BRS ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపైనా అప్పుడే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అప్పటిదాకా వెయిట్ చేయాలని ఆ ఎమ్మెల్యేలకు బీజేపీ సూచించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పదేళ్ళు అధికారంలోకి ఉండి ఇప్పుడు ఓటమితో కుంగిపోతున్న బీఆర్ఎస్‌కు ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్పే పరిస్థితి వస్తోంది. దాంతో ఎమ్మెల్యేలు గోడ దూకకుండా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తారన్నది చూడాలి.