రోజాతో కూటమి సర్కార్ ఆట మొదలెట్టిందా ? ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై 45 రోజుల్లో నివేదిక
మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా ? రేపో ఎల్లుండో...పోలీసులు ఇంటికి వెళ్లడం ఖాయమేనా ? ఆలస్యం కావచ్చునేమో కానీ...జైలుకు పోవడం గ్యారెంటీనా ? లోకేశ్ రెడ్ బుక్ లో ఆమె పేరు ఉందా ?

మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా ? రేపో ఎల్లుండో…పోలీసులు ఇంటికి వెళ్లడం ఖాయమేనా ? ఆలస్యం కావచ్చునేమో కానీ…జైలుకు పోవడం గ్యారెంటీనా ? లోకేశ్ రెడ్ బుక్ లో ఆమె పేరు ఉందా ? లేదంటే ఆమె చేసిన అక్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయా ? ఎమ్మెల్యే కాకముందు ఆమె ఆస్తులు ఎంత ? మంత్రి అయిన తర్వాత కూడబెట్టిన ఆస్తులు ఎన్ని అనే దానిపై లెక్కలు తీస్తోందా ? ఇప్పటికే కొందరు అధికారులు రోజా…అవినీతి అక్రమాలపై వివరాలు సేకరిస్తున్నారా ?
ఆర్కే రోజా…ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ ఛైర్మన్ గా సేవలందించింది. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. మంత్రి పదవి రాగానే మేడమ్ గారు…అధికార దర్పం ప్రదర్శించారు. మంత్రి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఆకట్టుకునేందుకు ప్రత్యర్థులపై డైలాగ్ లతో విరుచుకుపడింది. గౌరవ ప్రదమైన పదవీలో ఉన్నామన్న విషయాన్ని మరచిపోయి బూతులు అందుకుంది. వయసుతో సంబంధం లేకుండా…పదవులకు గౌరవం ఇవ్వకుండా…రెచ్చిపోయింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లను వ్యక్తిగతంగా అటాక్ చేసింది. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లను ఎగతాళి చేసింది. లోకేశ్ ను పప్పుగాడు అంటూ అవమానింది. చంద్రబాబుకు వయసు పెరిగినా…బుద్ది పెరగలేదంటూ దారుణంగా విమర్శించారు. నేచర్ చాలా గొప్పది…మనం ఏది ఇచ్చినా…అది తిరిగి ఇచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఇదే. మంత్రిగా రోజా మాములుగా చేయలేదు. నగరిలో ఆమె చేయని అక్రమాలు లేవు. పర్యాటక, క్రీడా శాఖల్లో ఆమె వ్యవహరించిన తీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రిగా ఉంటూనే…పదుల సంఖ్యలో తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలకు తీసుకెళ్లారు.
ఇవన్నీ ఒకెత్తయితే…వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా మరో ఎత్తు. ఆడుదాం ఆంధ్రాలో 119 కోట్ల అవినీతి జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్సీలు దువ్వరపు రామారావు, రాంగోపాల్ రెడ్డి…శాసనమండలిలో లేవనెత్తారు. 119 కోట్ల అవినీతిపై విచారణ జరిపించాలని…అవినీతితో సంబంధం ఉన్న మాజీ మంత్రితో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటిలోపు విచారణ జరుపుతుందో చెప్పాలని నిలదీశారు. ఇటు అసెంబ్లీలోనూ ఇదే అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు దర్యాప్తు జరిపించాలని డిమాండ్లు చేశారు. ఆట వస్తువులు, బ్రాండ్ అంబాసిడర్ల కోసం రూ.120 కోట్లు కేటాయించామని చెప్పి నిధులను మింగేశారని ఆరోపించారు. పరికరాలు, ఆట వస్తువులు ఏమైపోయాయో తెలియడం లేదని చెప్పారు.
అటు ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి…మండలిలోనే సమాధానం ఇచ్చారు. ఆడుదాం ఆంధ్రాలో అక్రమాలపై 45 రోజుల్లోనే నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. దీనిపై నిగ్గుతేల్చి సభాసంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మండిపల్లి తెలిపారు. ఈ క్రమంలోనే సమగ్ర విచారణ జరిపి ప్రజలకు నిజాలు చెప్పాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. అందుకు రాంప్రసాద్ రెడ్డి సరేనని అంగీకరించారు. ఆడుదాం ఆంధ్రాపై 45 రోజుల్లో నివేదిక ఇస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ప్రకటించడంతో…నెక్ట్స్ రోజా అరెస్టు ఖాయమన్న సంకేతాలు ఇచ్చింది కూటమి సర్కార్. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం అవినీతిలో…పాత్రధారి, సూత్రధారి మొత్తం రోజా అని ఆరోపణలు ఉన్నాయి. 119 కోట్ల పక్కదారి పట్టడంతో రోజా పాత్ర తేల్చాక…ఆమె జైలుకు వెళ్లడం గ్యారెంటీ అన్న ప్రచారం జరుగుతోంది.