Sidda Ramaiah: సిద్ధూనే కర్ణాటక సీఎం.. శివకుమార్‌కు హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ ఏంటి..
కర్ణాటక సీఎం రేసులో కొనసాగుతున్న ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయంతో దాదాపు సిద్ధరామయ్య పేరునే హైకమాండ్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ సీఎంగా చేసిన అనుభవం ఉండటం.. క్లీన్ బ్యాంగ్రౌండ్ ఉండటం సిద్ధరామయ్యకు కలిసివచ్చింది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న అసలు టెన్షన్ డీకే శివకుమార్.
కర్ణాటక విజయంలో కీ రోల్ ప్లే చేసిన శివకుమార్ సీఎం కుర్చీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులు పదవిని దూరం చేశాయి. దీంతో హైకమాండ్ ముందు డీకే శివకుమార్ రెండు డిమాండ్లు పెట్టినట్టు సమాచారం. ఐతే నన్ను సీఎం చేయండి.. లేదంటే మల్లికార్జున్ ఖర్గేను సీఎం చేయండి.. కానీ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధరామయ్యను సీఎం చేయొద్దనేది శివకుమార్ డిమాండ్. ముందు నుంచీ శివకుమార్, సిద్ధరామయ్య కాంగ్రెస్‌లో వేరు వేరు వర్గాలు మొయిన్‌టేన్ చేస్తూ వచ్చారు.
జస్ట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మాత్రమే ఇద్దరూ కలిసి పని చేశారు. ఇప్పుడు సీఎం పదవి ఎవరికి అనే క్వశ్చన్ రావడంతో వీళ్ల మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తనకు సీఎం పదవి రాకున్నా పర్లేదు కానీ.. సిద్ధరామయ్యకు మాత్రం ఇవ్వకూడదనే పట్టుదలతో ఉన్నాడు శివకుమార్. అయితే హైకమాండ్ మాత్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. క్లీన్ బ్యాగ్రౌండ్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా సిద్ధరామయ్యకే ఉంది. ఇవాళ సాయంత్రం లోగా ఆయనను సీఎంగా ప్రకటించే చాన్స్ ఉంది. ఇప్పుడు ఉన్న క్వశ్చన్ ఒక్కటే. సిద్ధరామయ్యకు సీఎం ఇస్తే.. శివకుమార్‌ను హైకమాండ్ ఎలా కూల్ చేస్తుంది. ఇప్పుడిదే సస్పెన్స్ కొనసాగుతోంది.
సిద్ధరామయ్యకు, శివకుమార్‌కు సీఎం పదవి సమానంగా పంచే ఆలోనచ కూడా చేస్తోంది కాంగ్రెస్. కానీ ఆ విషయంలో శివకుమార్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇవ్వడం తనకు ఇష్టం లేదని శివకుమార్ డైరెక్ట్‌గానే చెప్పేస్తున్నారు. అదేటైంలో తాను పార్టీకి అన్యాయం చేయనని కూడా చెప్తున్నారు. తన వైపు ఎమ్మెల్యేలు లేరని, పార్టీని చీల్చే ప్రయత్నాలు తాను చేయబోనని క్లారిటీ ఇచ్చారు. కానీ హైకమాండ్‌లో ఉండే టెన్షన్ ఎలా ఐనా ఉంటుంది. దీంతో సిద్ధరామయ్యను సీఎంగా ఎనౌన్స్ చేసిన తరువాత శివకుమార్‌కు హైకమాండ్ నుంచి ఎలాంటి ఆఫర్ వస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.