AP POLITICS: పవన్ ఒకటి చూపిస్తే.. పేర్ని నాని రెండు.. చెప్పుల రాజకీయం చెప్తుందేంటి ?
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కీ రోల్. ఆయన ఎటు వైపు ఉంటారన్న దాని మీదే.. 2024 ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది ఆధారపడి ఉంటుంది. టీడీపీతో పొత్తు దాదాపు కన్ఫార్మ్ అయినా.. సింగిల్‌గా వస్తానో, పొత్తుతో వస్తానో తెలియదు అంటూ సేనాని చేస్తున్న వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయ్.
AP POLITICS: వారాహి కదిలింది. రాజకీయం కూడా కదులుతోంది. ఎవరు అంగీకరించినా.. అంగీకరించకున్నా.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కీ రోల్. ఆయన ఎటు వైపు ఉంటారన్న దాని మీదే.. 2024 ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది ఆధారపడి ఉంటుంది. టీడీపీతో పొత్తు దాదాపు కన్ఫార్మ్ అయినా.. సింగిల్‌గా వస్తానో, పొత్తుతో వస్తానో తెలియదు అంటూ సేనాని చేస్తున్న వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయ్. వారాహి యాత్ర మొదలుపెట్టిన పవన్.. మాటలకు కూడా పదును పెంచారు.
తన టార్గెట్ జగన్‌ను గద్దెదించడమే అని వారాహి వేదికగా తేల్చిచెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో జనసేన అడిగిపెట్టి తీరుతుందని, అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడే.. వైసీపీకి చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చిన ఏకైక పార్టీ జనసేన అని పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంలో మంటలు రేపుతున్నాయ్. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా పేర్ని నాని విరుచుకుపడ్డారు. నీ కంటే పెద్ద మొగోడిని.. మక్కెలిరిగిపోతాయ్ అని రెండు చెప్పులు చూపించారు. ఆయనే ఓవర్ అంటే.. ఈయన డబుల్ ఓవర్ అనుకుంటున్నారు ఇదంతా చూసిన జనాలు ! ప్రత్యర్థి పార్టీ అధ్యక్షుడి ఇంటికి వెళ్లి భోజనం చేసేంత ఆరోగ్యకరంగా ఉండేవి ఒకప్పటి రాజకీయాలు. కానీ ఇప్పుడు.. విమర్శలు దాటి బూతుల వరకు వెళ్లాయ్ నాయకుల మాటలు. ఇంతకుమించి రాజకీయం దిగజారదు అనుకున్న ప్రతీసారి.. జనాలకు షాకే తగులుతోంది. ఇప్పుడు చెప్పులు చూపించుకునే వరకు వెళ్లింది. ఆయన ఒకటి చూపించా అంటాడు.. నేనే మగాన్ని, రెండు చూపిస్తా అంటాడు ఈయన.
ఏపీ రాజకీయంలో ఎలాంటి కొత్త.. కాదు కాదు చెత్త సంస్కృతి మొదలైందో.. పాలిటిక్స్ ఎంతలా దిగజారుతున్నాయో ఇదే ఎగ్జాంపుల్ చెప్పడానికి! శ్మశానం ముందు ముగ్గుండదు.. రాజకీయ నాయకుడికి సిగ్గుండదు అని అదేదో సినిమాలో డైలాగ్. వీళ్ల మాటలు.. వీళ్ల చేష్టలు చూసి.. అదే డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు జనాలంతా ! ఈ ఇద్దరు అనే కాదు.. ఈ ఒక్క పార్టీ అనే కాదు.. దాదాపు అన్ని పార్టీల్లోనూ అదే సీన్. దాదాపు అందరు నాయకులది ఇదే పరిస్థితి. మాట్లాడే బూతులు.. చూపించే చెప్పులు, చేతులు వేరు కావొచ్చు కానీ.. అంతా కలిసి రాజకీయం మీద వెగటు పుట్టిస్తున్నారు. అసలే రాజకీయం అంటే చిరాకు అనే ఫీలింగ్‌లోకి వెళ్లిపోయారు జనం. అలాంటిది ఇప్పుడు ఇలాంటి మాటలతో రాజకీయం మీద ఉన్న ఆ కాస్త గౌరవం కూడా తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది జనాల్లో.