Smita Sabharwal: ఆమె ఔట్.. ఈమె ఇన్.. తెలంగాణకు అమ్రపాలి.. స్మిత ఔట్..?

స్మిత సబర్వాల్‌ను పంపించిన రేవంత్.. ఆమ్రపాలిని తీసుకువచ్చేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమ్రపాలి.. తెలంగాణకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కార్యదర్శిగా.. అంటే సీఎంవో సెక్రటరీగా వస్తున్నట్లు సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2023 | 11:59 AMLast Updated on: Dec 12, 2023 | 4:01 PM

Smita Sabharwal Will Leave Telangana And Amrapali Kata Joins State

Smita Sabharwal: ప్రభుత్యం మారితే పరిస్థితులు, పథకాలు, పద్ధతులు మాత్రమే కాదు పని చేసే వాళ్ళు కూడా మారతారు. తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రభుత్వ శాఖల మీద పట్టు సాధిస్తున్న సీఎం రేవంత్.. తన టీం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడని పంపించి ఈవిడను తీసుకు వచ్చారు. స్మిత సబర్వాల్‌ను పంపించిన రేవంత్.. ఆమ్రపాలిని తీసుకువచ్చేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమ్రపాలి.. తెలంగాణకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కార్యదర్శిగా.. అంటే సీఎంవో సెక్రటరీగా వస్తున్నట్లు సమాచారం.

AP CM JAGAN: జగన్ కళ్ళు తెరువు ! ఏపీ మాహిష్మతి మునిగిపోయే టైమ్ వచ్చింది !!

ఉమ్మడి ఏపీలో 2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌గా అలాట్ అయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమె.. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా కొంతకాలం పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్‌కు వెళ్ళిన ఆమ్రపాలి.. ముందు కేంద్ర క్యాబినెట్‌లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది పనిచేశారు. ఆ తర్వాత పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆమె తిరిగి వచ్చేందుకు వీలుగా కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమ్రపాలి శుభాకాంక్షలు తెలిపారు. స్మిత సబర్వాల్ స్థానంలో ఆమ్రపాలి బాధ్యతలు తీసుకుంటారా అనే చర్చ సాగుతోంది. నిజానికి రేవంత్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్యం లోని కీలక అధికారులు అంతా వరుసపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లూ దూరంగా ఉన్న OSD ప్రియా వర్గీస్‌, మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌ అర్వింద్‌ కుమార్‌ కూడా రేవంత్‌ను కలిశారు.

ఐతే స్మితా సబర్వాల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో కొత్త చర్చ మొదలైంది.. స్మితా బదిలీ తప్పదు అని మొదటినుంచి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమ్రపాలి వచ్చి రేవంత్ కలవడంతో దాదాపు కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తుంది. దీంతో ఆవిడ పోయి .. ఈవిడ వచ్చే అనే ప్రచారం చర్చ జరుగుతోంది. దీంతో ఆమ్రపాలి కి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు అన్నది హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆమ్రపాలి సీఎంఓలోకి రాకపోవచ్చని, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఓఎస్డీగా ఉండొచ్చని.. లేదంటే అక్కడ రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలు చూస్తారని కొందరు అంటున్నారు. ఏమైనా ఆమ్రపాలి నియామకంపై ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.