Vangaveeti Radha vs Bonda Uma: విజయవాడ సెంట్రల్ సీట్ వార్.. టీడీపీలో వంగవీటి రాధా వర్సెస్ బోండా ఉమ
వంగవీటి రాధాను టీడీపీ నమ్మకపోవడానికి గల కారణాలంటూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు సర్యూలేట్ అవుతున్నాయి. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Vangaveeti Radha vs Bonda Uma: తెలుగు దేశం పార్టీలో సీట్ల లొల్లి పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతలు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ సీటు కోసం టీడీపీ నేతలు వంగవీటి రాధా, బోండా ఉమ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. నేరుగా కాకుండా తమ అనుచరుల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
CM REVANTH REDDY: రేవంత్ సమాచారం లీక్.. వాళ్ళందర్నీ మార్చేశారు
వంగవీటి రాధాను టీడీపీ నమ్మకపోవడానికి గల కారణాలంటూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు సర్యూలేట్ అవుతున్నాయి. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, వంగవీటి రాధాపై బోండా ఉమా వర్గీయులే పోస్టులు పెడుతున్నారంటూ రాధా వర్గం ఆరోపిస్తోంది. రాధాను టీడీపీకి దూరం చేసేందుకే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. రాధాపై బోండా అనుచరులు తప్పుడు ప్రచారం చేస్తుండటంతో.. రాధా అనుచరులు కూడా అంతే ఘాటుగా బదులిస్తున్నారు. బోండాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. రాధాపై బోండా అనుచరులు ఏడు పాయింట్లతో పోస్టులు పెడితే, బోండా ఉమాపై పదిహేడు పాయింట్లతో రాధా వర్గం పోస్టులు పెట్టింది. దేవుడి పేరుతో చందాలు పోగు చేసి దోచేయాలా ? స్థలాలు కబ్జా చేయాలా ? చిన్నపిల్లల చావుకు కారణం అవ్వలా ? కాల్ మన నిందితులకు కొమ్ముకాయాలా ?
కల్తీ మద్యం కేసులో నిందితులకు కొమ్ముకాయాలా ? సామాజిక రాజకీయ బిక్షపెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడవలా ? అంటూ పలు అంశాలతో బోండాకు వ్యతిరేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో విజయవాడ సెంట్రల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరోవైపు.. రాధా ఎప్పుడూ టీడీపీకి అనుకూలంగా లేడని ఉమ వర్గం విమర్శిస్తోంది. రాధ.. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీతో సన్నిహితంగా ఉన్నాడని కూడా గుర్తు చేస్తున్నారు. రాధ.. టీడీపీలో చేరినా.. ఆ పార్టీ కండువా కప్పుకోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. నిజానికి రాధ.. గతంలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే, చివరకు టీడీపీలోనే ఉండిపోయారు.