KCR, CM Stalin: బీఆర్ఎస్ కు షాకిచ్చిన స్టాలిన్ ..! కేసీఆర్ కు గుడ్ బై కొడుతున్న మిత్రులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ BRS కు షాక్ ఇచ్చింది DMK. తమ మిత్రుడు కేసీఆర్‌కు హ్యాండిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. తెలంగాణలో డీఎంకే మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని తెలిపారు. దాంతో దక్షిణాదిలో ఒక్కో పార్టీ కేసీఆర్ కు దూరమవుతోంది. కర్ణాటకలో జేడీఎస్ పార్టీ కుమార స్వామి.. బీజేపీతో జతకట్టారు. ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే ఇప్పుడు బీఆర్ఎస్ కి కాకుండా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2023 | 02:33 AMLast Updated on: Nov 21, 2023 | 2:41 PM

Stalin Shocked Brs Friends Bidding Goodbye To Kcr

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ BRS కు షాక్ ఇచ్చింది DMK. తమ మిత్రుడు కేసీఆర్‌కు హ్యాండిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. తెలంగాణలో డీఎంకే మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని తెలిపారు. దాంతో దక్షిణాదిలో ఒక్కో పార్టీ కేసీఆర్ కు దూరమవుతోంది. కర్ణాటకలో జేడీఎస్ పార్టీ కుమార స్వామి.. బీజేపీతో జతకట్టారు. ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే ఇప్పుడు బీఆర్ఎస్ కి కాకుండా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తోంది.

బీఆర్ఎస్ పార్టీ పెట్టాక .. థర్డ్ ఫ్రంట్ లోకి అన్ని ప్రతిపక్ష పార్టీలను తీసుకొచ్చి… బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో చక్రం తిప్పుదాం అనుకున్నారు కేసీఆర్. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో లీడర్లు అందర్నీ కలిశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కర్ణాటక జేడీఎస్ చీఫ్ కుమార స్వామి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్రలో శరద్ పవార్, శివసేన ఉద్దవ్ థాకరే.. ఇలా చాలా మందితో చర్చలు జరిపారు. అప్పట్లో తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ని కూడా కలిశారు కేసీఆర్. స్టాలిన్, కేసీఆర్.. ఇద్దరూ కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ కోసం చర్చలు కూడా జరిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రయత్నించారు. అందుకే ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ మద్దతు సీఎం కేసీఆర్‌కే ఉంటుందని భావించారు. కానీ, కేసీఆర్‌కు షాకిస్తూ కాంగ్రెస్‌కే తమ మద్దతు అని స్టాలిన్ ప్రకటించారు. తెలంగాణలోని తమ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని కూడా కోరారు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

KCR: కేసీఆర్‌కు షాకిచ్చిన స్టాలిన్.. కాంగ్రెస్‌కే మద్దతు..!

తమిళనాడులో ఇప్పటికే కాంగ్రెస్ తో డీఎంకే పొత్తు కొనసాగుతోంది. దాంతో ఇక్కడ కూడా ఆ పార్టీకే సపోర్ట్ చేయాలి స్టాలిన్ నిర్ణయించడం …కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిన కేసీఆర్‌కు ఇప్పుడు ఏ పార్టీ నుంచీ మద్దతు రావడం లేదు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలోకి కూడా కేసీఆర్ కు ఆహ్వానం అందలేదు. పైగా ఈ కూటమిలోకి BRS ను ఎంటర్ కానీయబోమని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తెలంగాణలో జరిగిన బహిరంగం సభల్లో కూడా చెప్పారు.

థర్డ్ ఫ్రంట్ కోసం తిరిగినప్పుడు కేసీఆర్ తో భేటీ అయిన నేతలంతా ఇప్పుడు బీఆర్ఎస్ కు ఎందుకు సహకరించడం లేదు. అంటే బీజేపీతో గులాబీ పార్టీకి రహస్య ఒప్పందం కుదిరిందన్న విమర్శలే ఇందుక్కారణం. కవితను అందుకే అరెస్ట్ చేయలేదన్న ప్రచారం తెలంగాణలోనే కాదు… దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ అనుమానం వల్లే జాతీయ స్థాయిలో కేసీఆర్‌ను ఏ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు. ఇటీవల కుమారస్వామి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు కావట్లేదని స్పందించారు. అందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒత్తిడే కారణమని హస్తం పార్టీ ఆరోపించింది. కేంద్రంలో ఇండియా కూటమిలో ఉన్నారు స్టాలిన్. తమిళనాడులో కాంగ్రెస్ తో పొత్తు కూడా ఉండటంతో మిత్ర ధర్మాన్ని పాటిస్తూ తెలంగాణలోనూ ఆ పార్టీకే మద్దతిచ్చారు. అంటే స్టాలిన్ కూడా కేసీఆర్ కి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఫిక్స్ అయ్యారా. అందుకే కేసీఆర్ కంటే కాంగ్రెస్సే ముఖ్యమని స్టాలిన్ భావిస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది. కానీ కేసీఆర్ కు మాత్రం దక్షిణాదిలోనూ ఒక్కో మిత్రుడు దూరం అవుతున్నారు.