స్టార్‌ హోటల్స్‌ రుషికొండ ప్యాలెస్‌ ? ఏం చేయబోతున్నారు…?

విశాఖలోని రుషికొండ మీద వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలు టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది. ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్స్‌ ఇవే. గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్డింగ్స్‌ విషయంలో జరిగిన వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. అసలు ఈ బిల్డింగ్స్‌ ఎందుకు కట్టారో కూడా గత ప్రభుత్వం పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2024 | 06:18 PMLast Updated on: Aug 30, 2024 | 6:18 PM

Star Hotels Rushikonda Palace

విశాఖలోని రుషికొండ మీద వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలు టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది. ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్స్‌ ఇవే. గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్డింగ్స్‌ విషయంలో జరిగిన వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. అసలు ఈ బిల్డింగ్స్‌ ఎందుకు కట్టారో కూడా గత ప్రభుత్వం పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ అని కొందరు చెప్తే.. లేదు లేదు ప్రభుత్వం గెస్ట్‌ హౌజ్‌ అని కొందరు చెప్పారు. ఇక ఈ బిల్డింగ్‌లో ఉన్న 30 లక్షల బాత్‌ టబ్‌ గురించి పెద్ద మాటల యుద్ధమే జరిగింది.

ఈ వ్యవహారంతా ఒక ఫ్లోలో కంటిన్యూ అవుతున్న టైంలోనే ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ నాయకులు ఈ బిల్డిండ్‌ ఇంటీరియర్‌ వీడియోలు రిలీజ్‌ చేశారు. రాజభవనం లాంటి ఈ బిల్డింగ్‌లను ఏం చేస్తారు అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సముంద్రం పక్కనే మంచి వ్యూ పాయింట్‌లో ఉన్న ఈ బిల్డింగ్స్‌ను కార్పోరేట్‌ హోటల్స్‌కు లీజుకు ఇస్తారని కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. భవనాలను హోటల్స్‌కు లీజుకు ఇచ్చే ఆలోచన ఇప్పటి వరకూ ప్రభుత్వం చేయలేదని చెప్పారు. త్వరలోనే ఈ బిల్డింగ్స్‌ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దాదాపు 450 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరిగే విధంగానే వాడుతామన్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.