ఏపీ కేబినేట్ మీట్: కేంద్రానికి షాక్ ఇవ్వనున్నారా…?
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన అంశాలకు కేబినెట్ లో చర్చ జరగనుంది. ఈ కేబినేట్ మీట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన అంశాలకు కేబినెట్ లో చర్చ జరగనుంది. మొత్తం 10 కంపెనీలకు సంబంధించి రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలియచేయనున్న మంత్రి మండలి… రాజధాని అమరావతికి గతంలో ఇచ్చిన నిర్మాణ పనుల టెండర్ల రద్దు కు క్యాబినెట్ లో చర్చించనుంది. ఆయా పనులకు కొత్తగా టెండర్లు పిలిచే అంశంపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి తొలగించేలా చట్ట సవరణకు కేబినెట్ లో చర్చ జరగనుంది. ఇక నుంచి భవన నిర్మాణ అనుమతుల్ని ఆయా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లే ఇచ్చేలా ఏపీ మెట్రో రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్ చైర్మన్ల పై అవిశ్వాస తీర్మానానికి ఉన్న గడువు తగ్గించే అంశంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. నాలుగేళ్లుగా ఉన్న గడువును రెండున్నరేళ్లకు కుదించేలా చట్ట సవరణకు కేబినెట్ లో చర్చ జరుగుతోంది.
విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులపై కేబినెట్ లో చర్చిస్తారు. ఈ ప్రాజెక్టులను వందశాతం కేంద్రమే భరించేలా కేబినెట్ లో తీర్మానం చేయాలని ప్రతిపాదన చేయనున్నారు. విశాఖలో మూడు కారిడార్ లు, విజయవాడలో రెండు కారిడార్లలో మెట్రో రైల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపనున్నారు. తొలిదశలో రూ.11 వేల కోట్ల వ్యయంతో మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్దం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కేంద్రానికి ఇది భారం కానుంది. టూరిజం పాలసీ ని ఆమోదించనున్న కేబినెట్… దానికి పరిశ్రమ హోదా కల్పించాలని ప్రతిపాదిస్తారు.