Sukesh Chandrasekhar: కేజ్రివాల్‌కు కోట్ల రూపాయల గిఫ్ట్‌లిచ్చా.. లిక్కర్ స్కామ్‌లో కొత్త బాంబ్ పేల్చిన సుకేష్..!
కేజ్రివాల్‌ను మరోసారి టార్గెట్ చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు లెటర్ రాశాడు సుకేష్ చంద్రశేఖర్. లిక్కర్ స్కాం నుంచి వచ్చిన డబ్బుతో కేజ్రివాల్, సత్యేంద్ర జైన్ ఇద్దరూ తమ ఇళ్లలో ఖరీదైన ఫర్నీచర్లు కొనుక్కున్నారని చెప్పాడు సుకేష్. ఆ ఫర్నీచర్‌ను స్వయంగా తానే కొన్నానంటూ బాంబు పేల్చాడు.
Sukesh Chandrasekhar: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సుకేష్ లీక్స్ కంటిన్యూ అవుతున్నాయి. వారానికో విషయం బయటపెడుతూ స్కాంలో ఇన్వాల్వ్ అయినవాళ్లకు వణుకు పుట్టిస్తున్నాడు సుకేష్ చంద్రశేఖర్. ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై, కల్వకుంట్ల కవిత పేర్లను ప్రస్తావిస్తూ లెటర్స్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు కేజ్రివాల్‌ను మరోసారి టార్గెట్ చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు లెటర్ రాశాడు. లిక్కర్ స్కాం నుంచి వచ్చిన డబ్బుతో కేజ్రివాల్, సత్యేంద్ర జైన్ ఇద్దరూ తమ ఇళ్లలో ఖరీదైన ఫర్నీచర్లు కొనుక్కున్నారని చెప్పాడు సుకేష్.
ఆ ఫర్నీచర్‌ను స్వయంగా తానే కొన్నానంటూ బాంబు పేల్చాడు. ఏం కొన్నాడు.. ఎక్కడ కొన్నాడు.. అన్ని వివరాలు లెటర్‌లో మెన్షన్ చేశాడు. తాను షోరూం నుంచి ఫర్నీచర్ ఫొటోలు పంపిస్తే.. కేజ్రివాల్, సత్యేంద్ర జైన్ ఇద్దరూ వాట్సాప్‌లో ఏం కావాలో సెలెక్ట్ చేసుకున్నారంటూ చెప్పాడు. దానికి సంబంధించిన బిల్స్, డీటెయిల్స్ అన్ని ఈడీ అధికారులకు ఫార్వర్డ్ చేశానని చెప్పాడు. కేజ్రివాల్ కోసం దాదాపు రూ.1.70 కోట్ల విలువైన ఫర్నీచర్ తాను కొన్నానని చెప్పాడు సుకేష్. రూ.45 లక్షలతో 12 సీట్ల డైనింగ్ టేబుల్, రూ.34 లక్షలతో డ్రెస్సింగ్ టేబుల్స్, రూ.18 లక్షలతో మిర్రర్స్, రూ.28 లక్షలతో బెడ్ రూమ్ ఇంటీరియర్, రూ.45 లక్షలతో వాల్ క్లాక్స్ కొన్నట్టు చెప్పాడు. డైనిగ్ టేబుల్ కేజ్రివాల్‌కు బాగా నచ్చిందని.. అది ఆలివ్ గ్రీన్ టేబుల్ అనీ.. దాని మీద ఉండే గ్లాసులు, ప్లేట్లు అన్నీ వెండితో చేసినవనీ పూస గుచ్చినట్టు పాయింట్.. టు పాయింట్ వివరించాడు సుకేష్.
ఈ ఫర్నీచర్ షాపింగ్ మొత్తం ఇటలీ, ఫ్రాన్స్, ఢిల్లీ, ముంబైలలోని షోరూమ్స్‌లో కొన్నామని చెప్పాడు. తన స్టాఫ్‌లో ఒకడైన రిషబ్ షెట్టి ఫర్నీచర్ మొత్తం సేఫ్‌గా కేజ్రివాల్ ఇంటికి చేర్చాడని చెప్పాడు. కేజ్రివాల్‌తో జరిగిన వాట్సాప్ చాటింగ్స్, ఫేస్‌బుక్‌లో మాట్లాడుకున్న కాల్ డిటెయిల్స్ అన్నీ తన దగ్గరే ఉన్నాయని చెప్పాడు. వాటిని కూడా ఈడీకి ఫార్వర్డ్ చేస్తానని చెప్పాడు సుకేష్. ఈ ఫర్నీచర్ మొత్తం ఇప్పుడు కేజ్రివాల్ ఇంట్లోనే ఉందని.. వాటి కొనుగోలు, బిల్స్ విషయంలో ఈడీ దర్యాప్తు చేయాలనేది సుఖేష్ మెయిన్ పాయింట్. కేజ్రివాల్ తన ఇంటి రెనోవేషన్, డెకరేషన్ కోసం రూ.45 కోట్ల ప్రజాధనం వాడుకున్నారంటూ ఢిల్లీ బీజేపీ నేతలు ఇటీవలే ఆరోపించారు. పేరుకు సింప్లిసిటీ అంటూ తిరిగే కేజ్రీవాల్.. కంఫర్ట్, విలాసాలకు చాలా ఖర్చు చేస్తారంటూ చెప్పారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సుకేష్ ఫర్నీచర్ విషయంలో ఆరోపణలు చేస్తూ లెటర్ రాయడం సంచలనంగా మారింది. కలర్‌తో సహా సుకేష్ అన్ని వివరాలు చెప్పడంతో.. సుకేష్ లీక్స్ కేజ్రీవాల్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.