Delhi police summons to Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు : గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయడంపై కేంద్రం హోంశాఖ సీరియస్ గా ఉంది. తప్పుడు వీడియోలు ఫేక్ చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. మే1 న తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయడంపై కేంద్రం హోంశాఖ సీరియస్ గా ఉంది. తప్పుడు వీడియోలు ఫేక్ చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. మే1 న తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు.
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని sc,st,obc వర్గాలకు పంచుతామని కేంద్రం హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా సిద్ధిపేట సభలో అన్నారు. ఈ వీడియోను మార్ఫింగ్ చేసి… అన్న వర్గాల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్టుగా ఫేక్ వీడియోను సృష్టించారు. కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోనే మార్ఫింగ్ చేయడంపై ఆ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఈ వీడియోపై స్పీడ్ గా ఎంక్వైరీ చేయాలని ఆదేశాలిచ్చింది.
గత రెండు రోజులుగా రిజర్వేషన్ల రద్దు అంశంపై బీజేపీని తప్పుబడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మంత్రులు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. దాంతో నకిలీ వీడియో హైదరాబాద్ లోనే తయారు చేసినట్టు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ సైబర్ క్రైమ్ డీఎస్పీ ఆధ్వర్యంలోని ఎనిమిది మంది అధికారుల బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ కు వచ్చి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఈ నోటీసులు ఇవ్వనున్నారు. రిజర్వేషన్లపై ఆరోపణలు చేసిన కొందరు కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశముంది. రేవంత్ రెడ్డిని మే 1న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.