రాజకీయాల్లో కానీ, న్యాయ సంబంధిత వ్యవహారాల్లో కానీ.... సంక్షోభం వస్తే దాన్నుంచి ఎంత త్వరగా బయటపడాలో ఆలోచించాలి తప్ప.... ఆ సంక్షోభంలో కూడా పబ్లిసిటీ కొట్టేద్దామని ఆలోచిస్తే పరిస్థితి కేటిఆర్ లాగే ఉంటుంది. ఈ కార్ రేస్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుతో కేటీఆర్ నిండా మునిగిపోయారు. ఆయన చేసిన వ్యూహాత్మక తప్పిదాలు.... ఈ కేసులో కేటీఆర్కు అన్ని అవకాశాల్ని పోగొట్టాయి. అన్ని దారులు మూసుకుపోయాయి. లొట్ట పీసు కేసు అంటూ ఎగతాళి చేసిన కేటీఆర్... ఆ కేసులోనే ఇప్పుడు నిండా మునిగిపోబోతున్నాడు. మాజీ మంత్రి కేటిఆర్ కు చివరి అవకాశం కూడా చేజారిపోయింది.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటిఆర్ క్వాష్ పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది... ఈ కేసులో అన్ని దారులు మూసుకుపోవడంతో ఇక కేటిఆర్ అరెస్టు తప్పేలా లేదు.ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటిఆర్ ఏ వన్ గా ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ . 54 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం లో కేటిఆర్ పాత్ర కీలకమని పేర్కొంది.ఏసీబీ FIR నమోదు చేసిన 24 గంటల్లోపే హైకోర్టును ఆశ్రయించారు కేటిఆర్.. తక్షణం అరెస్టు చేయవద్దు అని కోర్టు మొదట చెప్పడంతో స్వల్ప ఊరట లభించినా... ఆ తర్వాత అదే హైకోర్టులో అతనికి ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు నిధుల దుర్వినియోగం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తన తీర్పులో అభిప్రాయపడింది. ఆ తర్వాత లాయర్ తో కలిసి కేటిఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడు గంటలపాటు అతణ్ణి ప్రశ్నించిన ఏసీబీ స్టేట్మెంట్ రికార్డు చేసింది.అయితే నాలుగు ప్రశ్నల్ని నలభై సార్లు తిప్పి తిప్పి అడిగారని విచారణ పూర్తై బయటకొచ్చాక కేటిఆర్ చెప్పుకున్నారు.. మరోసారి ఏసీబీ పిలిచినా హాజరవుతానని చాలెంజింగ్ మూడ్ లో చెప్పారాయన.. అయితే ఏసీబీకి హాజరు కాకముందే, హైకోర్టు తీర్పు రాగానే, నిమిషాల్లో దానిని సుప్రీంకోర్టు లో సవాల్ చేశారు కేటిఆర్. అయితే అత్యవసరంగా అదేరోజు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై వాదన వినాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో జస్టిస్ బేళా త్రివేది బెంచ్ విచారణ లో కేటీఆర్ క్వాష్ పిటిషన్ అంశం నాలుగు నిమిషాల్లోనే ముగిసిపోయింది.ఫార్ములా ఈ కార్ కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉన్నందున ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. కేటిఆర్ ను క్వాష్ చేసేందుకు ఎలాంటి గ్రౌండ్స్ కనపడడం లేదన్న జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం... పిటిషన్ విచారణకు నిరాకరించింది.. పిటిషన్ ను డిస్మిస్ చేస్తామని బెంచ్ పేర్కొనడంతో దెబ్బకి విత్ డ్రా చేసుకుంటామని కేటిఆర్ లాయర్ చేతులెత్తేశాడు. సుప్రీంకోర్టు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో జోక్యానికి నిరాకరించడంతో ఇప్పుడు కేటిఆర్ కు అన్ని దారులూ మూసుకుపోయాయి.. ఇప్పుడు అతని ముందున్న ఆప్షన్స్ లో మొదటిది ఈడీ విచారణకు హాజరుకావడం... రెండోది మరోసారి ఏసీబీ రమ్మంటే వెళ్ళడం. మూడోది ముందు జాగ్రత్త చర్యగా ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించడం. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత... కింది కోర్టుల్లో ముందస్త బెయిలు రావడం కష్టమే. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అత్యుత్సాహానికి పోయి పదేపదే పొరపాట్లు చేశారు. ఈ కేసు ద్వారా తన మైలేజ్ పొందాలని అనుకున్నాడు తప్ప ఎక్కడ సీరియస్ గా వర్క్ చేసినట్టు కనబడదు. ఏసీబీ కేసు నమోదు చేసిన 24 గంటల్లోపే ఎఫ్ఐఆర్ కొట్టివేయలని కేటిఆర్ హైకోర్టును ఆశ్రయించడం ఒక తప్పు.ఏసీబీ కార్యాలయానికి లాయర్ తో కలిసి వెళ్లాలని యాగీ చేయడం మరో తప్పు. విచారణలో ఏం జరిగిందో తెలియదు కానీ ఏసీబీ అధికారుల దగ్గర విషయం లేదని చెప్పడం ఇంకో తప్పు. హైకోర్టు తీర్పును వెంటనే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం తప్పు పై తప్పు.ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోకుండా సమయం వృధా చేసుకున్నాడు కేటీఆర్.[embed]https://www.youtube.com/watch?v=x1TNygU0hs4[/embed]