ARTICLE 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. ప్రధాని స్పందన ఇదే..!
జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రజల ఐక్యత, అభివృద్ధి, దృఢవిశ్వాసం కోసం సుప్రీంకోర్టు సుస్పష్టమైన ప్రకటన చేసిందని వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ వేదికగా మోదీ స్పందించారు. ‘‘ఆర్టికల్ 370 రద్దుపై ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. 5 ఆగస్టు 2019న భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

ARTICLE 370: జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిచే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీతో జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా దక్కడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ప్రధాని మోదీ స్పందించారు.
ARTICLE 370 : 370 ఆర్టికల్ రద్దు కరెక్ట్.. సుంప్రీకోర్టు సంచలన తీర్పు
జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రజల ఐక్యత, అభివృద్ధి, దృఢవిశ్వాసం కోసం సుప్రీంకోర్టు సుస్పష్టమైన ప్రకటన చేసిందని వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ వేదికగా మోదీ స్పందించారు. ‘‘ఆర్టికల్ 370 రద్దుపై ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. 5 ఆగస్టు 2019న భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దృఢమైన విశ్వాసం కలిగిన జమ్మూ, కాశ్మీర్, లదాఖ్ ప్రజల కలలను సాకారం చేయడానికి నిబద్ధతతో ఉన్నాం. ఇది భారతీయులుగా మనమెంతో గర్వపడే అంశాన్ని, ఐక్యతను కోర్టు మరోసారి బలపర్చింది. ప్రగతి ఫలాలను సాధారణ ప్రజలతోపాటు సమాజంలో అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు అందజేస్తాం. ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన సమాజానికి అభివృద్ధి ఫలాలను అందజేస్తాం. ఈ తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు కాదు. ఇదొక ఒక ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. ఉమ్మడి భారతదేశాన్ని నిర్మించాలనే సమిష్టి సంకల్పానికి నిదర్శనం’’ అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా ఇతర పార్టీల నేతలు కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు.. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడంపైనా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 నాటికి జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌లో ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసీ గతంలోనే పేర్కొంది.