బ్రేకింగ్: సమాధానం చెప్తారా జైలుకు వెళ్తారా, తెలంగాణ సీఎస్‌కు సుప్రీం వార్నింగ్
కంచె గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. యూనివర్సిటీలో చెట్లు నరకొద్దంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగిస్తున్నట్టు సుప్రీం స్పష్టం చేసింది.

కంచె గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. యూనివర్సిటీలో చెట్లు నరకొద్దంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగిస్తున్నట్టు సుప్రీం స్పష్టం చేసింది. గతంలో విధించిన “స్టేటస్ కో”ను కొనసాగిస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఇక 100 ఎకరాల్లో చెట్లు నరకడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. చెట్లు నరికేందుకు ఎవరు అనుమతినిచ్చారంటూ తెలంగాణ సీఎస్‌ను కోర్టు ప్రశ్నించింది.
అనుమతి లేకుండా చెట్లు నరికారని తేలితే జైలుకు పంపిస్తామంటూ సీరియస్ అయ్యారు జస్టిగ్ గవాయి. 100 ఎకరాల్లో చెట్లు పునరుద్ధరించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ బాధ్యత తెలంగాణ సీఎస్‌దే నంటూ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎస్ జైలుకు వెళ్లకుండా కాపాడాలి అనుకుంటే 100 ఎకరాల్లో చెట్లు ఎలా పునరుద్దరిస్తారో వెంటనే వివరణ ఇవ్వాలంటూ తెలిపింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తనను తాను సమర్థించుకోకుండా చెట్ల పునరుద్ధరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.