సురేఖను తప్పించి విజయశాంతికి! కాంగ్రెస్‌లో సంచలనం

తెలంగాణలో క్యాబినెట్‌ విస్తరణలో భాగంగా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్‌ విస్తరణపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న హై కమాండ్‌..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 01:31 PMLast Updated on: Mar 25, 2025 | 1:31 PM

Surekha Gets Vijayashanti Sensation In Congress

తెలంగాణలో క్యాబినెట్‌ విస్తరణలో భాగంగా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్‌ విస్తరణపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న హై కమాండ్‌.. సీఎం రేవంత్‌ రెడ్డి డిప్యుటీ సీఎం భట్టిలతో చర్చలు జరిగింది. సుదీర్ఘ చర్చల తరువాత కొత్తగా నలుగురు ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, గడ్డం వివేక్‌, విజయశాంతి, సుదర్శన్‌ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌ రావు, వాకిటి శ్రీహరి పేర్లను హై కమాండ్‌ దాదాపు ఖరారు చేసింది. ఇందులో నలుగురు వ్యక్తులకు మంత్రి పదవి, ఇద్దరు వ్యక్తులకు డిప్యుటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఈ లిస్ట్‌లో రాజగోపాల్ రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి పేర్లు మంత్రులుగా దాదాపు ఖరారయ్యాయి. ఇక ఇప్పటికే ఉన్న మంత్రి వర్గం నుంచి ఇద్దరు మంత్రులకు ఉద్వాసక కల్పించే యోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో మంత్రి కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పేర్లు ప్రముఖంగా వినిస్తున్నాయి. వీళ్లిద్దరినీ మంత్రి పదవి నుంచి తొలగించి వీళ్ల స్థానంలో కొత్త మంత్రులను నియమించబోతున్నారని టాక్‌. ఉగాది పూర్తైన తరువాత వీళ్లలో ఎవరెవరికి ఏ మంత్రిత్వశాఖ ఇవ్వబోతున్నారు అనేది ఫైనల్‌ చేయబోతోంది కాంగ్రెస్‌.