సుదీక్ష కోణంకి మరణంపై సస్పెన్స్ కంటిన్యూ ,మరణాన్ని ధృవీకరించాలని పేరెంట్స్ వినతి
సుదిక్ష చౌదరి కోణంకి సముద్రంలో కొట్టుకుపోయిందా ? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా ? రెండు వారాలుగా గాలిస్తున్నా పురోగతి లేదా ? సుదీక్ష చనిపోయినట్లు ప్రకటించాలని పేరెంట్స్...

సుదిక్ష చౌదరి కోణంకి సముద్రంలో కొట్టుకుపోయిందా ? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా ? రెండు వారాలుగా గాలిస్తున్నా పురోగతి లేదా ? సుదీక్ష చనిపోయినట్లు ప్రకటించాలని పేరెంట్స్…డోమినికన్ రిపబ్లికన్ ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు ? కూతురిపై ఆశలు వదిలేసుకున్నారా ?కన్నబిడ్డ లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా ?
సుదిక్ష చౌదరి కోణంకి…డొమినికన్ రిపబ్లిక్‌లో అదృశ్యమైన భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోణంకి సుదీక్ష చౌదరి కుటుంబం…అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమె కుటుంబం కడప జిల్లా నుంచి వాషింగ్టన్‌కు వలస వెళ్లి స్థిరపడ్డారు. 17 రోజులుగా కనిపించకుండా పోయిన సుదీక్ష ఆచూకీ మిస్టరీగానే మారిపోయింది. బీచ్ వద్ద ఆమె దుస్తులు లభ్యం కావడం కలకలం రేపుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. సుదీక్ష కోణంకి మిస్టరీపై అమెరికన్ మీడియాలో నిత్యం ప్రసారాలు చేస్తోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు…తమ కూతురు చనిపోయినట్లు ప్రకటించాలని డోమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు.
కోణంకి సుదీక్ష తన స్నేహితురాళ్లతో కలిసి మార్చి 3 న…డొమినికన్ రిపబ్లిక్ లోని పుంటా కానాకు చేరుకుంది. పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో ఐదుగురు మహిళా విద్యార్థులతో కలిసి ఆమె విహారయాత్రకు వెళ్లింది. 6వ తేదీన సుదీక్ష కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యంపై అమెరికా ఫెడరల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు కరీబియన్ దేశంలోని అధికారులతో కలిసి పనిచేస్తున్నాయి. దాదాపు రెండు వారాలకుపైగా విస్తృతంగా గాలించినా ఆమె మృతదేహం లభ్యం కాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. తమ కుమార్తె అపహరణకు గురై ఉంటుందని సుదీక్ష తండ్రి ఆరోపించారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మార్చి 6వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు సుదీక్ష తన స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆమె ఐయోవాకు చెందిన 24 ఏళ్ల టూరిస్ట్ జాషువా స్టీవెన్ రిబెతో కలిసి బీచ్‌కు వెళ్లినట్లు సీసీ టీవీ ద్వారా నిర్దారించారు.
మార్చి 6వ తేదీ తెల్లవారు జామున రియు రెపుబ్లికా హోటల్ బార్ లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులతో కలిసి మద్యం సేవించడం కనిపించింది. ఈ వీడియోలో వైట్ కవర్ అప్ ధరించి తన స్నేహితులతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత తెల్లవారుజామున 4.15 గంటలకు కోణంకి బృందం బీచ్ లోకి ప్రవేశించారు. ఇది అక్కడి నిఘా కెమెరాలో రికార్డయింది.
ఉదయం 5.50 సమయంలో మిగతా వాళ్లు రిసార్టుకు వచ్చేశారు. టూరిస్టుల్లో ఒకరైన జాషువా స్టీవెన్ రిబే, సుదీక్ష బీచ్‌లోనే ఉండిపోయారు. ఆ తరువాత ఆమె ఆచూకీ లభించలేదు. ఉదయం 9 గంటల సమయంలో…రిబే ఒక్కడే బీచ్ నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీల్లో రికార్డయ్యింది. సాయంత్రమైనా సుదీక్ష ఆచూకీ లేకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలు, స్కూబా డైవర్లు, ఏటీవీలను మోహరించి తీరం, పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. 17 రోజులుగా గాలిస్తున్నా…సుదీక్ష ఆచూకీ మాత్రం దొరకడం లేదు.
అయోవాకు చెందిన జాషువా రిబే…సుదీక్షను చివరిసారిగా చూశాడు. ఆమె అదృశ్యంపై భిన్నరకాలుగా చెబుతున్నాడు. పెద్ద అలలు రావడంతో బీచ్ నుంచి వెళ్లిపోయానని ఓసారి, సుదీక్ష మోకాలి లోతు నీటిలో ఉండగా చివరగా చూశానని మరోసారి చెప్పాడు. ఆమె తీరంలో నడుస్తుండగా తాను నిద్రపోయానని మరోసారి చెప్పుకొచ్చాడు. పోలీసులు మాత్రం అతన్ని అనుమానితుడిగా భావించడం లేదు. బీచ్ లాంజ్‌లో ఆమె దుస్తులు కనిపించాయి. బహుశా బికినీలో సముద్రంలోకి వెళ్లి మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. డోమినికన్ రిపబ్లిక్ పోలీసులు జాషువాను విచారించి…ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో అతన్ని వదిలేశారు.