టీడీపీ అధ్యక్షుడ్ని డీజీపీగా పెట్టుకో
తమ పార్టీ అధ్యక్షుడు పైన వైసిపి నేతల పైన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని, వైసీపీ నేతలపై అక్రమ కేసులను ఆపాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ని జిల్లా వైసీపీ నేతలు కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు పైన వైసిపి నేతల పైన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని, వైసీపీ నేతలపై అక్రమ కేసులను ఆపాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ని జిల్లా వైసీపీ నేతలు కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కోడుమూరు వైసిపి ఇన్చార్జి ఆదిమూలపు సతీష్ వినతి పత్రం అందించారు.
మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. అరెస్టుల విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించిన కడప ఎస్పీని బదిలీ చేయడం, సిఐని సస్పెండ్ చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. టిడిపికి అనుకూలంగా పోలీసులు పని చేయాలంటే.. టిడిపి ముఖ్యనేతలను ఎస్పీలుగా డీఎస్పీ లుగా సిఐ లుగా పెట్టుకుంటే మంచిదేమో అంటూ హితవు పలికారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని డీజీపీగా నియమించుకోండని మండిపడ్డారు.