T CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ భేటీ.. పార్లమెంట్ ఎన్నికలపై చర్చ
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత, కాంగ్రెస్ పార్టీ పది రోజుల పాలనపై సమీక్షించారు. అలాగే ఖాళీగా ఉన్న రెండు మూడు జిల్లాల డీసీసీల నియామకంతోపాటు శాసన మండలిలో ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ల ఛైర్మన్ల పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
T CONGRESS: తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి టీపీసీసీ పీఏసీ భేటీ జరిగింది. సోమవారం మధ్యాహ్నం, హైదరాబాద్, గాంధీభవన్‌లో ఈ భేటీ జరిగింది. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్‌లకు ధన్యవాదాలు చెపుతూ తీర్మానం చేశారు.
PAWAN KALYAN: యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్
ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత, కాంగ్రెస్ పార్టీ పది రోజుల పాలనపై సమీక్షించారు. అలాగే ఖాళీగా ఉన్న రెండు మూడు జిల్లాల డీసీసీల నియామకంతోపాటు శాసన మండలిలో ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, డీసీసీ పదవుల భర్తీ, కార్పొరేషన్ల ఛైర్మన్ల పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలకు ఎలా చేరవేయాలనే దానిపై చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించనున్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఈ సమావేశంలో పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఆరు గ్యారంటీలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నేతలు ప్రభుత్వానికి సూచించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తేనే కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలుంటాయని నేతలు సీఎంకు సూచించారు.