T Krishna Prasad: తెలంగాణ నేతకు ఏపీలో టికెట్ ఇచ్చిన చంద్రబాబు..
లంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌ను.. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించారు కృష్ణప్రసాద్.
T Krishna Prasad: ఎన్నికల వేళ.. ఓ ఆసక్తికర పరిణామం కనిపించింది. మూడో జాబితాను విడుదల చేసిన టీడీపీ.. ఆ లిస్ట్‌లో తెలంగాణ నేతకు అవకాశం కల్పించింది. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌ను.. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించారు కృష్ణప్రసాద్.
TDP THIRD LIST: చంద్రబాబు ఎవరికి హ్యాండ్ ఇచ్చారంటే..
ఐతే ఆయనకు టికెట్ దక్కలేదు. లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ వస్తుందని అనుకున్నారు. వరంగల్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కృష్ణప్రసాద్.. ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ప్రధాని మోదీ పర్యటనల్లో కూడా ఆయనకు స్వాగతం పలికారు. బీజేపీలో ఆయన అభ్యర్ధిత్వం ఖాయమని అనుకున్నారు అంతా ! ఐతే ఎవరూ ఊహించని విధంగా ఏపీలో టీడీపీ టిక్కెట్ దక్కింది. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి తరఫున ఆయన పోటీ చేయనున్నారు. బాపట్లలో వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ పేరును ఖరారు చేశారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన బాపట్లలో.. టీడీపీకి బలమైన కేడర్ ఉంది. 1986 బ్యాచ్ ఐపీఎస్ అయిన కృష్ణప్రసాద్‌కు ముక్కుసూటి అధికారి అనే పేరు ఉంది.
2004లో ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. కృష్ణ ప్రసాద్ కొద్ది రోజులుగా బీజేపీ తరపున వరంగల్ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. వరంగల్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో.. ఏపీలో బాపట్ల టిక్కెట్ కోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఆయన అత్త శమంతకమణి.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ పరిచయాలతోనే ఆయనకు బాపట్ల టిక్కెట్ ఖరారైనట్టు తెలుస్తోంది.