Top story; 50 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు పాక్ సైన్యం భారత్‌తో చేతులు కలిపిన తాలిబన్ ఫైటర్లు
సరిహద్దుల్లో వేల మంది తాలిబన్ ఫైటర్లు కాచుక్కూర్చున్నారు. పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా దాడులు సైతం చేస్తున్నారు. 2640 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ వెంబడి ఎప్పుడు వార్ సైరన్ మోగుతుందో తెలీని సిట్యువేషన్ ఉంది.
సరిహద్దుల్లో వేల మంది తాలిబన్ ఫైటర్లు కాచుక్కూర్చున్నారు. పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా దాడులు సైతం చేస్తున్నారు. 2640 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ వెంబడి ఎప్పుడు వార్ సైరన్ మోగుతుందో తెలీని సిట్యువేషన్ ఉంది. ఇలాంటి సమయంలో ఎవరైనా తమ దేశ భద్రతపైనే ఫుల్ ఫోకస్ పెడతారు. కానీ, పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా? తమ సైన్యాన్ని బంగ్లాదేశ్‌కు పంపిస్తోంది. అదికూడా 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత. ఈ పరిణామాలే ఇప్పుడు మన దేశానికి కంటిమీద కునుకులేకుండా చేస్తు న్నాయి. ఐతే, యాభై సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ తన సేనల్ని బంగ్లాదేశ్ ఎందుకు పంపిస్తోంది? పాక్ సైన్యం ఢాకాలో అడుగుపెడితే మన దేశ భద్రతకు వచ్చే చిక్కులేంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
విధ్వేషం, విభజన పునాదులపై పురుడుపోసుకున్న పాకిస్తాన్ ముందు నుంచీ భారత వ్యతిరేకతే లక్ష్యం పని చేస్తోంది. ఫేక్ కరెన్సీ, డ్రగ్స్, ఉగ్రవాదం ఇలా ఒక్కటేంటి.. మనల్ని దెబ్బకొట్టడాని ఉన్న ఒక్క మార్గాన్ని కూడా వదిలిపెట్టలేదు. చివరికి ఆ కుట్రల్లో తానే బలైపోతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఆ దేశానికి బంగ్లా అస్త్రంగా మారింది. 1971లో తమ స్వేచ్ఛకు కొండంత అండగా నిలిచిన విషయాన్ని మరచి మళ్లీ ఆ కుట్రదేశంతోనే చెతులు కలుపుతోంది. అందులో భాగంగానే ఇస్లామాబాద్‌తో మరో డేంజర్ డీల్ కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఫలితంగానే అర్ధ శతాబ్దం తర్వాత పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టబోతోంది. వచ్చే నెలలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. 1971 లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్ సైన్యంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ కంటోన్మెంట్ నుంచి శిక్షణ ప్రారంభమవు తుంది. నాలుగు కంటోన్మెంట్లలో కూడా పాక్ ఆర్మీ శిక్షణ ఇవ్వబోతోంది. ఐతే, పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ ఇస్తే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు చిక్కు అక్కడే ఉంది.
పాకిస్తాన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఉగ్రవాదమూ కాలు మోపుతుంది. బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకతే లక్ష్యంగా పుట్టుకొచ్చిన జమాతే ఇస్లామీ పాకిస్తాన్ పెంచి పోషించిందే. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లోనే ఇది పనిచేస్తుంది. దీని కింద అన్సరుల్లా బంగ్లా, జమాత్ ఉల్ ముజాహీద్దిన్ బంగ్లాదేశ్ వంటి తీవ్రవాద సంస్థలున్నాయి. వాస్తవానికి 1991-96, 2001-2005 మధ్య జమాత్ మద్దతు కలిగిన బీఎన్పీ పార్టీ షేక్ ఖలిదా జియా అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ టెర్రరిజానికి బంగ్లాదేశ్‌తో లింకులు ఏర్పడ్డాయి. మసూద్ అజార్, సజ్జాద్ ఆఫ్ఘని వంటి జిహాదీ సూత్రధారులు బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొరబడ్డారు. బంగ్లాదేశ్ జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు కీలకంగా మారింది. ఇక లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ కూడా బంగ్లాదేశ్‌లో బలపడుతోంది. పాకిస్తాన్ సైన్య కనుక బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే ఈ ఉగ్రమూకలు మరింత బలపడటమే కాక.. భారత్‌లోకి చొచ్చుకు రావడం ఖాయం. పాకిస్తాన్ సైన్యం 50 ఏళ్ల తర్వాత సైనిక శిక్షణ పేరుతో బంగ్లాదేశ్ వచ్చే ప్రయత్నం వెనుకా ఆ కుట్రలే ఉంటాయి.
నిజానికి.. ఇప్పటికే చిట్టగాంగ్, కాక్స్ బజార్‌లోని రోహింగ్యా సెటిల్మెంట్లలో లష్కర్ కార్యకర్తలు పనిచేయడం ప్రారంభించారు. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ వంటి భారత వేర్పాటు వాద ఉగ్రసంస్థలకు కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోంది. వీరికి తీవ్రవాద గ్రూపులు శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఇండియాకు వ్యతిరేకంగా లష్కర్ రోహింగ్యాలను రిక్రూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్‌కు చెందిన పలువురు ఎల్‌ఈటీ, అల్‌ఖైదా జిహాదీ కమాండర్లు రోహింగ్యా క్యాంపులను సందర్శించినట్టు వార్తలొచ్చాయి. వారందరి లక్ష్యం ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడటమే వారి టార్గెట్. అందుకు వెస్ట్ బెంగాల్‌లోని అత్యంత సున్నితమైన ‘చికెన్స్ నెక్’ని ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని మన ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో చొరబాట్లు, బంగ్లా ముస్లింల జనాభా భారీగా పెరగడం భారత్‌ను కలవరపెడుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి పనిచేస్తున్నాయని చెబుతున్నాయి. పాకిస్తాన్ నౌకలపై ఉన్న ఆంక్షలను యూనస్ ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో యథేచ్చగా పాక్ నౌకలు బంగ్లాలోకి రావొచ్చు. ఇటీవలే కరాచీ నుంచి చిట్టగాంగ్ రేపుకు పాక్ నుంచి కార్గో నౌకలు వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి ఆయుధాల కొనుగోలుని వేగవంతం చేసింది. ఇప్పుడు తమ సైన్యానికి శిక్షణ ఇప్పించే పేరుతో పాక్ ఆర్మీని ఆహ్వానిస్తోంది. అన్నింటికీమించి ఈ రెండు దేశాలు చైనా నుంచి అత్యాధునిక ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నీ చూస్తే.. భారత్ లక్ష్యంగా కుట్రల దేశాలన్నీ కలిసి ఏదో పెద్ద కుట్రలే చేస్తున్నాయని తెలుస్తోంది. అయితే, ఈ కుట్రలన్నీ తాలిబన్లు డ్యూరాండ్ లైన్ దాటనంతవరకే.. ఒక్కసారి తాలిబన్ ఫైటర్లు బోర్డర్ దాటారంటే పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఏ దేశమూ కాపాడలేదు. తాలిబన్లతో డ్యూరాండ్ లైన్ దాటించడం భారత్‌కు అంతపెద్ద విషయమేం కాదు…