Tamilisai Soundararajan: ఎన్నికల్లో 5సార్లు ఓటమి.. ఎందుకో చెప్పిన తమిళి సై
ప్రస్తుతం చెన్నైలో ఇంటింటి ప్రచారం చేస్తున్న తమిళిసై.. తనను ఈసారైనా గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రధాని నరేంద్రమోడీకి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. త్వరలో బీజేపీ గెలిచే 400 సీట్లల్లో తనది కూడా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు తమిళిసై.
Tamilisai Soundararajan: తమిళిసై తెలంగాణ గవర్నర్ పదవికి రిజైన్ చేసి.. తమిళనాడులో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చెన్నై సౌత్ నుంచి ఆమె నిలబడ్డారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలకు స్వీకరించకముందు.. ఆమె ఐదు సార్లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేశారు. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. దాంతో బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవి అప్పజెప్పడంతో పార్టీకి రిజైన్ చేసి గవర్నర్ పగ్గాలు చేపట్టారు.
Congress: 1700 కోట్లు కట్టండి.. కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు.. బీజేపీ సంగతేంటన్న కాంగ్రెస్
ఎన్నికల్లో 5 సార్లు ఓడిపోవడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడమే కారణమన్నారు తమిళిసై. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లాగే ఈమె కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఎన్నికలకు డబ్బుల్లేక ఖర్చుపెట్టడం లేదన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఇంటింటి ప్రచారం చేస్తున్న తమిళిసై.. తనను ఈసారైనా గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రధాని నరేంద్రమోడీకి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. త్వరలో బీజేపీ గెలిచే 400 సీట్లల్లో తనది కూడా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు తమిళిసై. 2014 నుంచి 2019 సెప్టెంబర్ వరకూ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారామె. 2019 నుంచి 2024 మార్చి దాకా తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి రిజైన్ చేశారు. ఇక తమిళిసై ఎన్నికల నామినేషన్ కోసం రెడీ చేసిన అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల లెక్కలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఆమెకు 2 కోట్ల 17 లక్షల రూపాయలకు మించి ఆస్తులు లేవట. బ్యాంక్ అకౌంట్‌లో ప్రస్తుతం 50 వేలు మాత్రమే ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో రాశారు. కోటీ 57 లక్షల విలువైన చరస్తులు ఉన్నాయి. తమిళిసై పేరుతో ఒక్క కారు కూడా లేదు. కూతురు పేరున నాలుగు కార్లు ఉన్నాయట. తమిళిసై భర్త పేరున 3 కోట్ల 92 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్టు ఎలక్షన్ అఫిడవిట్‌లో రాశారు తమిళిసై. ఓటమికి ఆమె చెప్పిన కారణాలపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.