తమిళనాట జనసేన స్ట్రాటజీ.. పవన్‌ కల్యాణ్‌తో అట్లుంటది మరి!

రాజకీయం మారింది.. జనాలు మారారు.. వాళ్ల ఆలోచన మారింది. ఎంత క్రేజ్ ఉన్నా సరే.. పార్టీ పెట్టగానే అధికారం అంటే ఇప్పట్లో అయ్యే వ్యవహారం కాదు. ఏపీలో పవన్‌ కల్యాణ్‌ కూడా పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2025 | 02:50 PMLast Updated on: Mar 03, 2025 | 2:50 PM

Tamilnadu Janasena Strategy Same With Pawan Kalyan

రాజకీయం మారింది.. జనాలు మారారు.. వాళ్ల ఆలోచన మారింది. ఎంత క్రేజ్ ఉన్నా సరే.. పార్టీ పెట్టగానే అధికారం అంటే ఇప్పట్లో అయ్యే వ్యవహారం కాదు. ఏపీలో పవన్‌ కల్యాణ్‌ కూడా పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. తమిళనాట క్రేజీ స్టార్ట్ విజయ్‌ రాజకీయ పార్టీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ప్రశాంత్ కిషోర్‌ను స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకున్నారు. ఐతే ఇప్పటికిప్పుడు విజయ్ టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే ! దీంతో పవన్ కల్యాణ్‌ ఫాలో అయిన స్ట్రాటజీని విజయ్‌ కోసం వర్కౌట్ చేసే ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయ్. జనసేన పార్టీ పెట్టి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసిన పవన్.. 2019లో ఒంటరిగా పోటీ చేసి విఫలం అయ్యారు.

ఆ తర్వాత వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని.. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చారు. డిప్యూటీ సీఎంగా కంటిన్యూ అవుతున్నారు. ఇదే ఫార్ములాను విజయ్‌ కోసం తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించారనే టాక్ నడుస్తోంది. తమిళగ వెట్రిగ కజగం పేరుతో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయ్. గెలిచి తీరాల్సిందేనని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీరుతానని హామీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. విజయ్‌ దగ్గరకు ఓ ఆసక్తికర ప్రతిపాదనను చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఇప్పుడు అధికార పార్టీగా డీఎంకే ఉంటే… విపక్షంగా అన్నాడీఎంకే ఉంది. డీఎంకే అధికారంలో కొనసాగుతుంటే.. అన్నాడీఎంకే 25 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో గట్టిగానే స్ట్రాంగ్‌గానే ఉంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓట్ల శాతం కాస్త తగ్గినా… అన్నాడీఎంకేకు కాస్తో కూస్తో ఓటు బ్యాంకు పెరిగినా… పెద్దగా మారేదేమీలేదు. క్లియర్‌గా చెప్పాలంటే.. ఇంకోసారి డీఎంకేనే అధికారంలోకి వస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో అధికారానికి కావాల్సిన 40శాతానికి పైగా ఓట్లను సాధించడం విజయ్ పార్టీకి సాధ్యం కాదు. మహా అయితే టీవీకేకు 20శాతం ఓట్లు పడే చాన్స్ ఉంది. ఇదే విషయాన్ని విజయ్‌కు అర్థం అయ్యేలా చెప్పిన పీకే.. పవన్ కల్యాణ్‌ మార్క్ వ్యూహాన్ని వివరించారట. విపక్షంలో ఉన్న అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే.. ఆ పార్టీకి దక్కే 25శాతం ఓట్లకు… టీవీకేకు పడే 20 శాతం ఓట్లు యాడ్ అవుతాయని.. ఇంకొన్ని చిన్నాచితక పార్టీల ద్వారా వచ్చే ఓట్లతో అన్నాడీఎంకే, టీవీకే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని ప్రశాంత్ కిషోర్‌ వివరించారట. సీఎం పళనిస్వామికి అప్పగించి.. డిప్యూటీ సీఎం సీటును విజయ్ తీసుకోవచ్చని పీకే సలహా ఇచ్చారట. సొంతంగా అధికారంలోకి వద్దాం అనుకుంటే.. ప్రశాంత్ కిషోర్‌ ఇలాంటి సలహా ఇచ్చారేంటి అని విజయ్ డైలమాలో పడిపోయారట. మరి ఆయన సలహాను స్వీకరిస్తారో లేదో చూడాలి మరి…