కూతుళ్ళకు పెళ్లిళ్లు…భక్తులకు సన్యాసం… ఇది జగ్గీవాసుదేవ్ భోగోతం..
ఆయనో స్వామిజీ....శివరాత్రి వచ్చిందంటే చాలు...ఆయనే సెంటరాఫ్ అట్రాక్షన్. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీలు, విదేశీయులను ఆశ్రమానికి పిలుస్తారు. అధ్యాత్మిక పాఠాలు చెబుతారు. తనను మించిన శివభక్తుడు ప్రపంచంలోనే లేరనేలా బిల్డప్ ఇస్తారు.
ఆయనో స్వామిజీ….శివరాత్రి వచ్చిందంటే చాలు…ఆయనే సెంటరాఫ్ అట్రాక్షన్. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీలు, విదేశీయులను ఆశ్రమానికి పిలుస్తారు. అధ్యాత్మిక పాఠాలు చెబుతారు. తనను మించిన శివభక్తుడు ప్రపంచంలోనే లేరనేలా బిల్డప్ ఇస్తారు. పాటలు పాడుతారు…లక్షల మంది భక్తుల ముందు నాట్యమాడుతారు… శివరాత్రి మొత్తం భక్తి మైకంలో తేలిపోతున్నట్లు నటిస్తారు. ఆ దేవదేవుడే తనను ఆవరించాడనేలా ప్రవర్తిస్తారు. భక్తి పాటలతో ముక్తి కలుగుతుందంటూ…నీతి వ్యాక్యాలు వల్లిస్తారు. శివుడి గురించి తనకు తెలిసినంత ఎవరికి తెలియదనేలా షో చేస్తారు. ఇంత ఉపోద్ఘాతం ఎవరికి గురించి అనుకుంటున్నారా ? ఆయనే ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్.
ఇదంతా బయటకు కనిపించే రూపం…ఆయనలో కనిపించని మరో కోణం ఉంది. అదే తను ఒకటి పాటిస్తూ…భక్తులను మాత్రం మరోటి పాటించడంటూ సూక్తులు చెబుతారు. తాను పెళ్లి చేసుకున్నాడు…పిల్లలను కన్నాడు.. వారిని పెంచి పెద్ద చేశాడు. విద్యాబుద్దులు నేర్పించాడు. అయితే తన వద్దకు భక్తులందర్ని వివాహ బంధానికి దూరంగా ఉండాలని వేదాలు వల్లిస్తారు. ఆధ్యాత్మికత అంటే భక్తేనని…అది సన్యాసంతోనే సాధ్యం అవుతుందంటూ నమ్మిస్తున్నారు. ఆధ్యాత్మికత పేరుతో వందల మంది మహిళలకు సన్యాసం ఇప్పిస్తున్నారు. వారిని కుటుంబాలకు….పేగు బంధాన్ని దూరం చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చేలా…అమ్మాయిలను సన్యాసులు మారుస్తున్నారు. ఇషా ఫౌండేషన్ కు వచ్చిన తర్వాత…అమ్మాయిల మైండ్ సెట్ పూర్తిగా మార్చేస్తున్నారు. వారు మళ్లీ ఇంటికి వెళ్లకుండా…తల్లిదండ్రులను కలవకుండా చేస్తున్నారు. ఆశారాం బాపు, రామ్ రహీమ్ సింగ్ లాగే…జగ్గీ వాసుదేవ్ ఫౌండేషన్ లో కనిపించని దారుణాలు జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఊరందరికి భక్తి పాఠాలు, అధ్యాత్మిక చింతన అంటూ నిత్యం ఊదరగొట్టే జగ్గీ వాసుదేవ్…తన కుటుంబం విషయంలో మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం…తన పిల్లలకు ఏదీ ఎప్పుడు చేయాలో అది చేశారు…చేస్తున్నారు. పిల్లలు పెళ్లీడు రాగానే…వివాహం చేసి అత్తారింటికి పంపించారు. ఇతరుల పిల్లలకు ఆధ్యాత్మికత పేరుతో సన్యాసం ఇప్పస్తున్న జగ్గీ వాసుదేవ్…తన సొంత పిల్లలకు ఎందుకు సన్యాసం ఇవ్వాలేదో చెప్పాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రిటైర్డ్ ఫ్రొఫెసర్ ఎస్ కామరాజ్…మద్రాస్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తన ఇద్దరు కుమార్తెలకు…ఇషా ఫౌండేషన్ లో సన్యాసం ఇప్పించారని కోర్టుకు తెలిపారు. వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఆశ్రమంలో బంధించారని…ఇషా ఫౌండేషన్ లో పని చేసే వ్యక్తులు…బ్రెయిన్‌వాష్ చేస్తున్నారని పేర్కొన్నారు. తమ కూతుళ్లను సన్యాసులుగా మార్చారని…కుటుంబంతో సంబంధాలు కొనసాగించకుండా అడ్డుకుంటున్నారని పిటిషన్ లో ప్రస్తావించారు.
జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం, వి.శివజ్ఞానంలతో కూడిన ధర్మాసనం…ఇషా ఫౌండేషన్ లో జరుగుతున్న వ్యవహారాలపై పలు ప్రశ్నలు సంధించింది. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసి స్థిరపడేలా చేశారని…యువతులను మాత్రం సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహించారని కోర్టు ప్రశ్నించింది. ఇషా ఫౌండేషన్ పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని…పిటిషనరల్ తరపు లాయర్ న్యాయస్థానానికి తెలిపారు. ఇషా యోగా సెంటర్ లో పని చేసే వైద్యుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదయిన విషయాన్ని వివరించారు. తాము స్వచ్ఛందంగానే ఇషా యోగా కేంద్రంలో ఉంటున్నామని…తమను ఎవరు బలవంతం చేయలేదని కామరాజ్ కూతుళ్లుకు న్యాయస్థానానికి తెలిపారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మీకు…తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం కరెక్టేనా అంటూ ప్రశ్నించింది. అక్టోబరు 4 తేదీలోపు ఇషా ఫౌండేషన్ కేసులపై సమగ్రంగా స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లో దాదాపు 2వందల పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఫౌండేషన్ లో ఉంటున్న వారి భద్రత గురించి ఆరా తీశారు.
రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ ఆరోపణలను ఇషా ఫౌండేషన్ ఖండించింది. ప్రజలకు శాంతి, ఆధ్యాత్మికతను అందించడానికి ఇషా ఫౌండేషన్ ప్రారంభించామని వెల్లడించింది. ఫౌండేషన్ కు వచ్చే వ్యక్తులు…తమకు ఇష్టమైతేనే సన్యాసం స్వీకరించివచ్చని…భక్తి మార్గాన్ని ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. వివాహం లేదా సన్యాసం కోసం వ్యక్తులను ఒత్తిడి చేయడంపై వచ్చిన ఆరోపణలను ఫౌండేషన్ తోసిపుచ్చింది. సొంత పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్న జగ్గీ వాసుదేవ్…ఇతరులను ఎందుకు కుటుంబ వ్యవస్థకు దూరంగా ఉంచుతున్నాడో ఆయనే సమాధానం చెప్పాలి.