టాటా వీలునామా..! 10 వేల కోట్లు ఎలా పంచాడో చూడండి..!
రతన్ టాటా మరణించి ఆర్నెళ్లు పూర్తి అవుతోంది. ఆయన భౌతికంగా లేకపోయినా...నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇందుకు కారణం... ఆయన చేసిన గొప్ప పనులే.

రతన్ టాటా మరణించి ఆర్నెళ్లు పూర్తి అవుతోంది. ఆయన భౌతికంగా లేకపోయినా…నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇందుకు కారణం… ఆయన చేసిన గొప్ప పనులే. ఒక మనిషి విలువ బతికి ఉన్నప్పటి కంటే చనిపోయిన తర్వాతే ఎక్కువ తెలుస్తుందని అంటారు. నిజంగానే రతన్ టాటా మానవత్వం గురించి ఎంత చెప్పిన తక్కువే. తాజాగా తాను రాసిన వీలునామా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలల తర్వాత బయటకు రతన్ టాటా వీలునామా, అమలు చేసే బాధ్యత న్యాయవాది, స్నేహితుడు, సోదరీమణులదేబాంబే హైకోర్టులో ప్రొబేట్ కోసం పిటిషన్ దాఖలు.
రతన్ టాటా…గతేడాది అక్టోబరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 86 ఏళ్ల వయసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆరు నెలల తర్వాత ఆయన వీలునామా బయటకు వచ్చింది. తనకున్న ఆస్తుల్లో ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో…వీలునామాలో స్పష్టంగా రాసుకొచ్చారు. అంతేకాదు…దాన్ని అమలు చేసే బాధ్యతను…న్యాయవాది డేరియస్ కంబట్టా, స్నేహితుడు మెహ్లీ మిస్త్రీ, సోదరీమణులు షిరీన్, డియాన్నాలకు రతన్ టాటా అప్పగించారు. దీంతో వారు బాంబే హైకోర్టులో ప్రొబేట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రొబేట్ అంటే చనిపోయిన వ్యక్తి వీలునామాను వాలిడేట్ చేసే ప్రక్రియ. దీంతోపాటు ఆస్తులను వీలునామా ప్రకారం పంచడానికి అమలు చేసే వారికి అనుమతి ఇవ్వడం. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పడుతుంది.సేవాగుణంలో రతన్ టాటాకు మరెవ్వరూ సాటిరారు
ఆస్తుల్లో సింహభాగాన్ని దాతృత్వానికే రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, ఎండోమెంట్ ట్రస్టులకు 3,800 కోట్లు మిగిలిన ఆస్తిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులకు
సేవాగుణంలో రతన్ టాటాకు మరెవ్వరూ సాటిరారు. తన ఆస్తుల్లో సింహభాగాన్ని దాతృత్వానికే కేటాయించారు. తన ఆస్తి సుమారు రూ. 10వేలకోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. 3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేశారు. ఇందులో సుమారు రూ.3800 కోట్ల సంపదను.. తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ వంటి వాటికి కేటాయించారు. మిగిలిన ఆస్తిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, శంతను నాయుడు,పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. ఇందులో సింహభాగం రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆ నిధులను దాతృత్వానికి వినియోగిస్తాయి. వీలునామాలో రాయని షేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులూ ఈ దాతృత్వ సంస్థలకే చెందుతాయని వీలునామాలో రాశారు.శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్‌కి 800 కోట్లు,ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్స్‌తో పాటు ఖరీదైన వాచ్‌లు, పెయింటింగ్స్,సన్నిహితుడు మోహిన్ ఎం దత్తాకు 800 కోట్లు,మరో మిత్రుడు మెహిల్ మిస్త్రీకి అలీబాగ్‌లోని బంగ్లా, మూడు పిస్టోళ్లు.
తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుమీద రూ.800 కోట్లు రాశారు. ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్స్‌తో పాటు ఖరీదైన వాచ్‌లు, పెయింటింగ్స్ వంటి విలువైన వస్తువులున్నాయి. జిమ్నీ నావల్ టాటాకు.. రతన్ టాటాకు చెందిన జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించారు. రతన్ టాటాకు సన్నిహితుడైన.. మోహిన్ ఎం దత్తాకు కూడా రూ.800 కోట్లు రాశారు. అలీబాగ్‌లోని బంగ్లా, మూడు పిస్టోళ్లను మరో మిత్రుడు మెహిల్ మిస్త్రీ పేరు మీద రాశారు. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పని చేసిన శంతను నాయుడుకు ఇచ్చిన విద్యా రుణాన్ని రతన్ టాటా మాఫీ చేశారు. తన పొరుగింటి వ్యక్తి జేక్ మాలైట్‌కు ఇచ్చిన వడ్డీ లేని రుణాన్నీ రతన్ మాఫీ చేశారు.
సీషెల్స్‌లోని భూమిని సింగపూర్‌లోని ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్‌కు ఇవ్వాలని వీలునామాలో రతన్ టాటా రాశారు. వీలునామాలో శునకాల సంరక్షణ కోసం 12 లక్షలు, రతన్ టాటాకు విదేశాల్లో కూడా 40 కోట్ల విలువైన ఆస్తులు ప్రముఖ కంపెనీలలో షేర్స్, ఖరీదైన 65 వాచీలు, రతన్ టాటాకు మూగజీవాలంటే మహాప్రాణం. అందులనూ కుక్కలంటే చాలా ఇష్టం. వీలునామాలో…శునకాల సంరక్షణ కోసం 12 లక్షలు కేటాయించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 30వేలు చొప్పున వాటికి ఖర్చుచేసే విధంగా వీలునామాలో పొందుపరిచారు. రతన్ టాటాకు విదేశాల్లో కూడా 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
ఇవి కాకుండా ప్రముఖ కంపెనీలలో షేర్స్, ఖరీదైన 65 వాచీలు కూడా ఉన్నాయి. రతన్ టాటా 1937 డిసెంబరు 28న నావల్ టాటా, సోనూలకు ముంబయిలో జన్మించారు. ముబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…గతేడాది అక్టోబరు 9న కన్నుమూశారు. సేవాగుణంలో కరోనా మహమ్మారిపై పోరు కోసం 1500 కోట్ల భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే రతన్ టాటా తన కంపెనీల తరపున పేదలను ఆదుకుంటూ ఉంటారు. అలానే మూగ జీవాలంటే ఎంతో ప్రేమ ఉంది. వాటి కోసం ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందు కోసం 165 కోట్లు వెచ్చించారు.