బ్రేకింగ్: కొట్టుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు పిఠాపురంలో రచ్చ రచ్చ
పిఠాపురంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వర్మను ఆహ్వానించకపోవడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

పిఠాపురంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వర్మను ఆహ్వానించకపోవడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తిలో ఓ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన ఇన్చార్జ్ శ్రీనివాస్ వచ్చారు.
వర్మను ఆహ్వానించకపోవడంపై అసహనానికి గురైన టీడీపీ కార్యకర్తలు శ్రీనివాస్‌ను అడ్డుకున్నారు. దీంతో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రీసెంట్‌గానే జనసేన విజయకేతన సభలో వర్మపై నాగబాబు పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఓపెనింగ్‌కు పిలవకుండా మరోసారి వర్మను అవమానించారంటూ టీడీపీ కార్యకర్తలు మండి పడుతున్నారు.