TDP-BJP-JANASENA: ఢిల్లీకి చంద్రబాబు, పవన్.. బీజేపీతో పొత్తుపై తేల్చేస్తారా..?
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ అవుతారు. రెండు రోజులపాటు పవన్, చంద్రబాబు ఢిల్లీలో పర్యటించి, సీట్ల సర్దుబాటుపై చర్చిస్తారు.

TDP-BJP-JANASENA: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ అధినాయకత్వంతో పొత్తులపై చర్చించనున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ అవుతారు. రెండు రోజులపాటు పవన్, చంద్రబాబు ఢిల్లీలో పర్యటించి, సీట్ల సర్దుబాటుపై చర్చిస్తారు.
KTR VS REVANTH REDDY: మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్..
ఇటీవల టీడీపీ, జనసేన కొన్ని సీట్ల ప్రకటన సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి వెళ్లబోతున్నట్లు హింట్ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో కూడా బీజేపీతో పొత్తు ఉంటుందంటూ పవన్ చెప్పేశారు. దీంతో ఇక ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీగా పోరు ఉండబోతుంది. బీజేపీతో పొత్తు అంశంపై ఇప్పటికే చంద్రబాబు ఒక దఫా అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమై, పొత్తులపై చర్చలు జరిపారు. బీజేపీ కూడా పొత్తుపై ఆసక్తిగానే ఉంది. అమిత్ షా కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పొత్తులపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఇక పొత్తును అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చి 2 తర్వాత ఎప్పుడైనా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీట్ల సంఖ‌్య కూడా తేల్చేస్తారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కలిపి 33 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించేలా చంద్రబాబు అంగీకరించారు.
దీనిలో భాగంగా జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది టీడీపీ. మిగిలిన 9 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు.. బీజేపీకి ఇస్తారు. పొత్తులపై అధికారిక ప్రకటన తర్వాత రెండు, మూడు రోజుల్లో టీడీపీ, జనసేన రెండో జాబితా విడుదలయ్యే అవకాశముంది. ఆ వెంటనే బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి 99 సీట్లను అభ్యర్థులను ప్రకటించారు. జనసేన 24 సీట్లల్లో పోటీ చేయనుండగా.. తొలి జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.