TDP-BJP: కమలంతో దోస్తీ.. ఏపీలో బీజేపీకి టిక్కెట్లు ఎన్ని..?
ఏపీలో బీజేపీ ఎన్ని సీట్లు కావాలని కోరుతోందంటే.. 10 నుంచి 20 దాకా స్థానాల్లో పోటీకి బీజేపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ మాత్రం 15 సీట్ల వరకే కమలం పార్టీకి ఇస్తుందంటున్నారు. మరి బీజేపీ కోరే 15 స్థానాల్లో ఆ పార్టీకి ఎంత పట్టు ఉందనేది డౌటే.
TDP-BJP: టీడీపీ-జనసేన కలిసి 99 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ 94, జనసేన ఐదు సీట్లల్లో అనౌన్స్ చేశాయి. జనసేనకు ఇచ్చే 24 స్థానాలు కలిపితే ప్రస్తుతానికి 118స్థానాల్లో రెండు పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటారు. ఏపీలో మొత్తం 175 స్థానాలు ఉంటే.. ఇంకా టీడీపీ-జనసేన కూటమిలో 57 సీట్లకు లెక్క తేలాల్సి ఉంది. బీజేపీ కూడా ఈ కూటమిలో కలవబోతోంది. సో.. ఈ పార్టీకి కూడా కొన్ని సీట్లు ఇవ్వడానికే వీటిని దాచి ఉంచినట్టు అర్థమవుతోంది. ఏపీలో బీజేపీ ఎన్ని సీట్లు కావాలని కోరుతోందంటే.. 10 నుంచి 20 దాకా స్థానాల్లో పోటీకి బీజేపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
DELHI LIQOUR SCAM: ముందు కేజ్రీవాల్.. తర్వాత కవిత.. అరెస్టు తప్పదా..?
టీడీపీ మాత్రం 15 సీట్ల వరకే కమలం పార్టీకి ఇస్తుందంటున్నారు. మరి బీజేపీ కోరే 15 స్థానాల్లో ఆ పార్టీకి ఎంత పట్టు ఉందనేది డౌటే. పైగా ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్ళు.. ఏరి కోరి కమలం గుర్తు మీద ఓట్లు వేస్తారా..? వేయిస్తారా..? అన్నది డౌటే. పైగా ఇలాంటి టీడీపీ రెబల్స్ అందర్నీ ఎన్నికల్లో నిలబెట్టి.. వెనక నుంచి ఫండింగ్ చేసి.. కూటమి ఓట్లకు గండికొట్టాలని వైసీపీ కాసుకు కూర్చుంది. ఇప్పటికే ఏపీలో జనసేన, బీజేపీకి టిక్కెట్లు వస్తాయని అనుకునే నియోజకవర్గాల్లో టీడీపీ అసమ్మతులకు ఫ్యాను పార్టీ లీడర్లు గాలం వేశారని అంటున్నారు. ఇలా చీలిక తెస్తే.. తమ పార్టీ అభ్యర్థికి ప్లస్ అవుతుందని ప్లాన్ చేస్తోంది వైసీపీ. ఏపీలో బీజేపీకి 15 స్థానాలు ఇచ్చినా.. ఇంకా 42 సీట్లు టీడీపికి మిగులుతాయి. ఇవి చాలా కీలకం అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. అలాగే బీజేపీకి వీలైనన్ని తక్కువ సీట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలని చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు.
బీజేపీకి అసెంబ్లీ స్థానాల కంటే ఎంపీ సీట్లే ముఖ్యం. అందుకే ఎంపీ సీట్లు ఎక్కువ ఇచ్చినా ఫర్వాలేదు.. తమకు ఎసరు పెట్టొద్దని టీడీపీ సీనియర్లు బాబును రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ లిస్టులో కొందరు టీడీపీ సీనియర్ల పేర్లు కూడా అనౌన్స్ చేయలేదు. బీజేపీ నుంచి క్లారిటీ వచ్చాక.. వాళ్ళ టిక్కెట్ల సంగతి తేల్చాలని బాబు డిసైడ్ అయ్యారు. మరి వచ్చే వారంలో అయినా ఢిల్లీ బీజేపీ పెద్దలు కరుణిస్తారా..? పొత్తుల సంగతి తేల్చేస్తారా అన్నది చూడాలి. అందాక టీడీపీలో సీనియర్లు, వైసీపీ నుంచి వచ్చిన జంపింగ్స్ వెయిటింగ్ తప్పేలా లేదు.