TDP Family Politics: ఫ్యామిలీ ప్యాకేజీలు.. టీడీపీకి తలనొప్పిగా ఫ్యామిలీ పాలిటిక్స్

టీడీపీకి కొన్ని కుటుంబాలు అతి పెద్ద ఆబ్లిగేషన్‌గా మారుతున్నాయి. ఆయా జిల్లాల్లో మొదటి నుంచి బలమైన పొలిటికల్ ఫ్యామ్లీలుగా ఉండటం.. గతం నుంచి వారు చెప్పినట్టే జిల్లా రాజకీయాలు నడవడంతో పాటు జిల్లాలను శాసించే స్థాయికి ఆ కుటుంబాలు వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2024 | 03:52 PMLast Updated on: Feb 05, 2024 | 3:52 PM

Tdp Facing Problems With Party Leaders Over Their Family Politics

TDP Family Politics: టీడీపీకి కొన్ని కుటుంబాలు తలనొప్పిగా మారాయి. డబుల్స్‌లో ట్రబుల్స్‌ తప్పడంలేదు. ఫ్యామిలీ ప్యాకేజ్‌లు ఇవ్వలేక, అలాగని సర్ది చెప్పలేక అధినాయకత్వం సతమతం అవుతోంది. టీడీపీకి కొన్ని కుటుంబాలు అతి పెద్ద ఆబ్లిగేషన్‌గా మారుతున్నాయి. ఆయా జిల్లాల్లో మొదటి నుంచి బలమైన పొలిటికల్ ఫ్యామ్లీలుగా ఉండటం.. గతం నుంచి వారు చెప్పినట్టే జిల్లా రాజకీయాలు నడవడంతో పాటు జిల్లాలను శాసించే స్థాయికి ఆ కుటుంబాలు వచ్చాయి. అదే ఇప్పుడు టీడీపీ అధినాయకత్వానికి ఇబ్బందికరమైన అంశంగా మారుతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రాజకీయాల తీరు మారింది. కానీ ఇప్పటికీ పాత పద్దతిలోనే వెళ్లాలంటే కొన్ని సందర్భాల్లో కుదరని పరిస్థితి.

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు.. సుప్రీంకోర్టులో విచారణ 16కు వాయిదా..?

అలాగని ఈ ఫ్యామ్లీలను టచ్ చేయాలంటే అనేక రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. శ్రీకాకుళం జిల్లా మొదలుకుని.. అనంతపురం జిల్లా వరకు కొన్ని జిల్లాల్లోని ఫ్యామ్లీలు టీడీపీని ఇబ్బంది పెడుతున్నట్టే కన్పిస్తోందంటున్నాయి రాజకీయవర్గాలు. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం. ముందుగా ఎర్రన్నాయుడు, ఆ తర్వాత అచ్చెన్నాయుడు వచ్చారు. అచ్చెన్నాయుడు ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఆ కుటుంబానికి ఇచ్చే సీట్ల విషయంలో క్లారిటీగా ఉన్నా.. జిల్లాలో ఆ ఫ్యామ్లీ ఆధిపత్యాన్ని.. కాదని ఏమీ చేయలేని పరిస్థితి. ఇక విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు ఫ్యామ్లీ కూడా సెన్సిటివ్ వ్యవహారమనే చెప్పాలి. విజయనగరం ఎంపీ స్థానం, విజయనగరం ఎమ్మెల్యే రెండింటిని కోరుతున్నారు. ఏదో ఒక స్థానానికి పరిమితం కావాలని పార్టీ సూచిస్తోంది. అది కూడా విజయనగరం ఎమ్మెల్యే సీటుకు అశోక్ గజపతి రాజు పోటీ చేస్తేనే బాగుంటుందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంటే.. కుమార్తెనే బరిలోకి దింపాలని భావిస్తున్నారు అశోక్. ఆ నిర్ణయాన్ని కాదనలేని పరిస్థితి టీడీపీలో కన్పిస్తోంది. ఇక చింతకాయల ఫ్యామ్లీ కూడా అదే తరహా సున్నితమైన అంశంగా మారింది.

IND Vs ENG: రెండో టెస్టులో భారత్ ఘనవిజయం.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్న కుటుంబం అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశిస్తోంది. ఆ స్థానం చింతకాయల కుటుంబానికి ఇచ్చే సూచనలు కనిపించట్లేదు. దీనిపై క్లారిటీ ఇస్తే.. అయ్యన్న అలిగే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే పార్టీకి ఇబ్బందులు ఉండవచ్చంటున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా విమర్శలు వస్తాయనే ఆందోళనతో ఉంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో యనమల ఫ్యామ్లీతో పార్టీ అధినాయకత్వానికి ఇబ్బందులు వస్తున్నాయి. తునిలో టీడీపీకి వరుస పరాజయాలు వస్తున్నా.. అక్కడి నుంచి యనమల ఫ్యామ్లీని కాదని వేరే వారికి ఇచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఈ దఫా టిక్కెట్ మార్చినా.. యనమల ఫ్యామ్లీకే వెళ్లింది. ఇక కృష్ణా జిల్లాలో దేవినేని కుటుంబం. దేవినేని కుటుంబం నుంచి ప్రస్తుతం టీడీపీలో దేవినేని ఉమా మహేశ్వరరావు కీలక నేతగా ఉన్నారు. గతంతో పోలిస్తే ఉమ ప్రభావం.. ప్రాభవం కొంత మేర తగ్గినా.. దేవినేని కుటుంబాన్ని పూర్తిగా ఈక్వేషన్స్ నుంచి తప్పించలేని పరిస్థితి. కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం ఆలూరు, కర్నూలు ఎంపీ స్థానాలను ఆశిస్తోంది. రెండింటిని ఇవ్వలేని పరిస్థితి పార్టీలో కన్పిస్తోంది. డోన్ నుంచి కోట్ల కుటుంబానికి టిక్కెట్ ఇవ్వొచ్చంటున్నారు. దీంతో కోట్ల ఫ్యామ్లీకి ఏ విధంగా నచ్చచెప్పాలనే దిశగా పార్టీ కసరత్తు చేస్తోంది. కర్నూలు జిల్లా టీడీపీలో KE ఫ్యామ్లీ ప్రాభవం నెమ్మదిగా తగ్గుతోంది.

JANASENA: పొత్తులో జనసేనకు దక్కబోయే స్థానాలు ఇవేనా..?

కోట్ల ఫ్యామ్లీకి కొద్దిపాటి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. దీంతో ఈ రెండు కుటుంబాలను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి కూడా టీడీపీకి వస్తోందనే చెప్పాలి. అనంత జిల్లాలో పరిటాల కుటుంబం పార్టీకి అతి పెద్ద ఆబ్లిగేషన్. పరిటాల కుటుంబం అలిగిందనే చర్చే బయటకు వస్తే.. ఆ ప్రభావం పార్టీ మీద పడుతుందనే ఆందోళన టీడీపీ అధినాయకత్వాన్ని పీడిస్తోంది. పరిటాల కుటుంబం రాప్తాడు, ధర్మవరం టిక్కెట్లు ఆశిస్తోంది. కానీ ధర్మవరం టిక్కెట్ వరదాపురం సూరికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది పార్టీ. ఈ విషయంలో పరిటాల ఫ్యామ్లీకి నచ్చచెప్పక తప్పదు. అలాగే జేసీ కుటుంబం కూడా రెండు టిక్కెట్లను ఆశిస్తోంది. జేసీ ఫ్యామ్లీకి రెండు టిక్కెట్లు ఇవ్వడం కుదరదని ఇప్పటికే పార్టీ అధినాయకత్వం చెప్పేసినట్టు తెలుస్తోంది. దీనిపై జేసీ ఫ్యామ్లీ ఇంకా తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నట్టు సమాచారం. జేసీ ఫ్యామ్లీ నుంచి ఎవరైనా తెగించి మాట్లాడితే… అది పార్టీ మీద నెగెటివ్‌ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది. దీంతో ఆ కుటుంబాన్ని కూడా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుందనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. మొత్తమ్మీద ఈ ఫ్యామిలీ ప్యాకేజ్‌లు టీడీపీకి ఇబ్బందికరకమైన అంశంగానే ఉంటుందనీ….. వీరి విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందనే చర్చ టీడీపీలో జరుగుతోంది.