TDP TENSION: సిద్ధంసభలో జనం చూసి.. టీడీపీలో దడ
భీమిలిలో జరిగిన మొదటిసభను లైట్‌గానే తీసుకుంది తెలుగుదేశం. ఆ తర్వాత దెందులూరులో జరిగిన రెండో మీటింగ్‌ను చూసి.. ఏముందబ్బా.. సభ చప్పగానే ఉంది అని భావించారట టీడీపీ నేతలు. కానీ రాప్తాడు సభతో ఒక్కసారిగా ఉలిక్కి పడిందట ఆ పార్టీ.
TDP TENSION: వైసీపీ సిద్ధం సభలు టీడీపీకి వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయి. పార్టీ అగ్ర నాయకత్వాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. పాజిటివ్.. పాజిటివ్ అంటూ ఇన్నాళ్ళు.. రా.. కదలిరా.. సభలకు వస్తున్న జనాన్ని చూసి జబ్బలు చరుచుకున్న టీడీపీ అగ్ర నాయకత్వానికి రాప్తాడు సిద్ధం సభ చూశాక కళ్ళు బైర్లు కమ్మాయి. టీడీపీలో ఇప్పుడు వైసీపీ సిద్ధం సభల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. భీమిలిలో జరిగిన మొదటిసభను లైట్‌గానే తీసుకుంది తెలుగుదేశం. ఆ తర్వాత దెందులూరులో జరిగిన రెండో మీటింగ్‌ను చూసి.. ఏముందబ్బా.. సభ చప్పగానే ఉంది అని భావించారట టీడీపీ నేతలు. కానీ రాప్తాడు సభతో ఒక్కసారిగా ఉలిక్కి పడిందట ఆ పార్టీ.
PAWAN KALYAN: పవన్ పోటీ చేసే స్థానం ఫిక్స్.. భీమవరం నుంచే జనసేనాని
పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు.. ఆ సభకు వచ్చిన జనంలో రెస్పాన్స్ షాకింగ్‌గానే ఉందన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. రాయలసీమలో కూడా టీడీపీ చాలా వరకు బలపడిందనీ.. కడప లాంటి జిల్లాల్లో కూడా వైసీపీ బలహీన పడిందనే భావనలో ఇన్నాళ్లూ ఉన్నారు సైకిల్ పార్టీ నేతలు. కానీ రాప్తాడు సిద్ధం సభతో ఓ విధంగా టీడీపీ నేతల కళ్లు బైర్లు కమ్మాయన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఎన్నికలకు ముందు సీఎం జగన్ సభలకు ఈ స్థాయిలో జనం రావడం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చే అంశమనేది టీడీపీలో జరుగుతున్న చర్చ. చంద్రబాబు నిర్వహిస్తున్న రా.. కదలి రా.. సభలకు కూడా జనం బాగానే వస్తున్నారని ఇన్నాళ్లూ సంబర పడుతోంది తెలుగుదేశం. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న రా కదలి రా సభలకు రెస్పాన్స్ బాగుందని సంతోషంగా ఉన్న టీడీపీ శ్రేణులకు రాప్తాడు సిద్దం సభ షాక్ ఇచ్చినట్టయింది. ఈ క్రమంలో వైసీపీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే వైసీపీని టార్గెట్ చేసుకునే సందర్భాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
VIRAT KOHLI: అకాయ్ అంటే అర్థం తెలుసా!
అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాయట టీడీపీ శ్రేణులు. వైసీపీ ఓ పక్కన అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేసి.. సిద్దం సభలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ ఇంకా అభ్యర్థుల ఖరారు విషయంలో వెనకబడినట్టే కన్పిస్తోంది. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకున్నా.. చంద్రబాబు లోలోపలే వ్యవహారాన్ని చక్కబెడుతున్నా.. క్షేత్ర స్థాయిలో గందరగోళం మాత్రం పార్టీ కేడర్‌ని ఇబ్బంది పెడుతూనే ఉందట. ఇప్పటికీ అభ్యర్థుల విషయంలో క్లారిటీ రాకపోవడం.. అటు జనసేనతో సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదనే ప్రచారంతో కేడర్‌లో విపరీతమైన నిరాశ నిస్పృహలు పెరుగుతున్నాయన్న ఫీడ్ బ్యాక్.. పార్టీ కార్యాలయానికి వస్తోందట. అయినా అధినాయకత్వం ఏం చేయలేని పరిస్థితి. బీజేపీతో పొత్తుల వ్యవహరం కొలిక్కి రాకపోవడంతో ఏం జరగబోతోందనే విషయం అర్థంగాక టీడీపీ కేడరులో ఆందోళన వ్యక్తమవుతోందంటున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తు వల్ల నష్టమే తప్ప.. లాభం లేదనే చర్చ పార్టీలోని లీడర్లను కుదేలయ్యేలా చేస్తోంది.
ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 60కు పైగా ఉంటాయనీ.. వాటిల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు. బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో టీడీపీ మీదున్న పాజిటివ్ ఇంపాక్ట్ నెమ్మదిగా తగ్గుతోందన్న అభిప్రాయం ఎక్కువవుతోంది. ఈ క్రమంలో సిద్దం లాంటి సభలతో వైసీపీ దూసుకెళ్లే ప్రయత్నం చేయడం.. దానికి ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో రాజకీయం ఎటు వైపు మళ్లుతుందో అర్థం కాని పరిస్థితి ఎక్కువ మంది టీడీపీ నేతల్ని కంగారు పెడుతోంది. వీలైనంత త్వరగా అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉందని, లేదంటే ఘోరంగా దెబ్బతింటామన్న సూచనలు తెలుగుదేశం హైకమాండ్‌కు అందుతున్నాయట. పాజిటివ్ వైబ్స్ వస్తున్న టైంలో… నాన్చుడు ధోరణితో నిర్ణయాలు తీసుకోలేకపోతే మూల్యం గట్టిగానే చెల్లించుకోవాల్సి వస్తుందన్న వార్నింగ్‌లను పార్టీ పెద్దలు ఏ మేరకు చెవికెక్కించుకుంటారో చూడాలంటున్నారు టీడీపీ నాయకులు.