TDP-JANASENA: ఎందుకు ఆగారంటే..! సీట్ల సర్దుబాటు ఎందుకు ఆగింది..?

పొత్తు గురించి ప్రాథమికంగా మాత్రమే భేటీ అయిన బాబు, పవన్.. ఆ తర్వాత మళ్ళీ చర్చించలేదు. అందుక్కారణం బీజేపీయే అంటున్నారు. ఏపీలో టీడీపీ-జనసేన మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు తేలలేదు. రెండు పార్టీల అధినేతలు కూడా పూర్తిస్థాయిలో చర్చలు ప్రారంభించలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 13, 2024 | 03:13 PMLast Updated on: Jan 13, 2024 | 6:43 PM

Tdp Janasena Alliance And Seats Will Be Decided Soon

TDP-JANASENA: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన.. కూటమిగా కలసి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొంటూనే ఉన్నారు. తమ ఉమ్మడి శత్రువు జగన్మోహన్ రెడ్డి అని వాళ్లు చెప్పేశారు. అయితే పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటు ఎప్పుడు చేసుకుంటున్నారన్న దానిపై మాత్రం రెండు పార్టీల్లో క్లారిటీ లేదు. పొత్తు గురించి ప్రాథమికంగా మాత్రమే భేటీ అయిన బాబు, పవన్.. ఆ తర్వాత మళ్ళీ చర్చించలేదు. అందుక్కారణం బీజేపీయే అంటున్నారు. ఏపీలో టీడీపీ-జనసేన మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు తేలలేదు. రెండు పార్టీల అధినేతలు కూడా పూర్తిస్థాయిలో చర్చలు ప్రారంభించలేదు.

Namrata Shirodkar: నమ్రత.. ఎందుకిలా..? జగన్‌ ప్లస్‌ మహేశ్‌ బాబు.. ఏం జరిగింది..?

ఇప్పటివరకూ ప్రాథమికంగా మాత్రమే చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇక రెండు పార్టీల నేతలు.. ఎవరికి వారే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను రెడీ చేసే పనిలో ఉన్నారు. చంద్రబాబు అయితే పార్టీ తరపున, బయటి వ్యక్తులతో.. నియోజకవర్గాల్లోని ప్రజలకు ఫోన్లు చేసి సర్వేలు తయారు చేయిస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా నియోజకవర్గాల్లో మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. జనసేన కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ చేస్తున్నారు. రెండు పార్టీల అధినేతలూ గెలుపు గుర్రాలను రెడీ చేస్తున్నారే గానీ.. పొత్తుల సంగతి మాత్రం ఇంకా మాట్లాడుకోలేదు. 25-30 అసెంబ్లీ స్థానాలను జనసేనకు ఇస్తారని టాక్ అయితే నడుస్తోంది. కానీ ఈమధ్య కాలంలో జనసేనలోకి వలసలు బాగా పెరిగాయి. అధికార వైసీపీ నుంచి కొందరు నేతలు జనసేనలోకి చేరుతున్నారు. వలసలు పెరగడంతో సీట్లు పెంచాలని ఆ పార్టీ లీడర్లు కోరుతున్నారు. అందుకోసం టీడీపీ ముందు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. జిల్లాకు 2స్థానాలు తగ్గకుండా ఇవ్వాలంటోంది గ్లాసు పార్టీ. పండగ తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో జాయిన్ అవుతున్నారు. అప్పుడు కాపు కమ్యూనిటీ నుంచి కూడా సీట్ల కోసం పవన్ కల్యాణ్ పై ప్రెజర్ పెరిగే అవకాశముంది. టీడీపీ– జనసేన సీట్ల సర్దుబాటుపై ముందుకు వెళ్ళకపోవడానికి ప్రధాన అడ్డంకి బీజేపీయే.

తాము NDAలోనే ఉన్నామనీ.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు కొనసాగుతుందని పవన్ కల్యాణ్ చాలాసార్లు చెప్పారు. కానీ ఆ పార్టీతో పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. అందుకే ముందుకెళ్ళలేకపోతున్నాయి టీడీపీ-జనసేన. బీజేపీ నుంచి క్లారిటీ వచ్చాకే స్థానాలపై చర్చించుకోవాలని బాబు-పవన్ నిర్ణయించారు. పవన్ కల్యాణ్‌కు టీడీపీ నేతల నుంచి ఇప్పుడు కొత్త రిక్వెస్టులు మొదలయ్యాయి. తమ స్థానాల జోలికి రావొద్దని వాళ్ళు కోరుతున్నారు. పవన్‌ను స్వయంగా కలసి అభ్యర్థిస్తున్నారు కొందరు టీడీపీ నేతలు. ఇంకొందరు టీడీపీలో తమకు టిక్కెట్ రాకపోతే జనసేన నుంచి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం జనసేనతో లాబీయింగ్ మొదలుపెట్టారు. టీడీపీ-జనసేన కూటమితో పొత్తు ఉంటుందా.. లేదా అన్నది ఏపీ బీజేపీ నేతలు కూడా తేల్చలేని పరిస్థితి లేదు. ఢిల్లీ నుంచి కమలం పెద్దలు మాత్రమే డిసైడ్ చేయాలి. పార్టీ ఇంఛార్జులు.. ఏపీ లీడర్ల నుంచి ఇప్పటికే అభిప్రాయ సేకరణ జరిపి.. బీజేపీ అధిష్టానికి నివేదిక సమర్పించారు. ఎక్కువ మంది కూటమితో కలిసే పోటీ చేయాలని కోరుతున్నారు. బీజేపీ నుంచి క్లియరెన్స్ వస్తే.. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై బాబు-పవన్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

https://youtu.be/Cjd2yx5FqIM