TDP LOKSABHA: టీడీపీ లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటించే అకాశం
మొత్తం 175 స్తానాలకుగాను.. టీడీపీ 144 ఎమ్మెల్యే స్థానాల్లో, 17 లోక్‌సభ సీట్లలో పోటీ చేయనుంది. దీనిలో ఇప్పటివరకు అసెంబ్లీ సీట్లకు సంబంధించి 128 మంది అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది. మరో 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వెల్లడించాల్సి ఉంది.

TDP over confidence.. victory is not so easy..
TDP LOKSABHA: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 175 స్తానాలకుగాను.. టీడీపీ 144 ఎమ్మెల్యే స్థానాల్లో, 17 లోక్‌సభ సీట్లలో పోటీ చేయనుంది. దీనిలో ఇప్పటివరకు అసెంబ్లీ సీట్లకు సంబంధించి 128 మంది అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది.
Mahesh : మహేష్, రాజమౌళి సినిమాలో విలన్ గా స్టార్ హీరో!
మరో 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వెల్లడించాల్సి ఉంది. అయితే, లోక్‌సభ అభ్యర్థుల్లో ఒక్కరిని కూడా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మొదటి విడదలో పది మంది అభ్యర్థుల పేర్లను మంగళవారం సాయంత్రమే వెల్లడించే అవకాశముంది. మిగతా ఏడు సీట్లపై కూడా కసరత్తు కొనసాగుతోంది.
కూటమిలోని బీజేపీ కూడా ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. జనసేన మాత్రం ఆరుగురి ఎమ్మెల్యే పేర్లను ప్రకటించింది. రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీడీపీ ఖరారు చేసిన లోక్‌సభ అభ్యర్థుల వివరాలివి.
ఒంగోలు : మాగుంట రాఘవరెడ్డి
అనంతపురం : జేసీ పవన్ రెడ్డి
నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
విజయవాడ : కేశినేని చిన్ని
హిందూపురం : బీకే పార్థసారధి
నంద్యాల : బైరెడ్డి శబరి
గుంటూరు : పెమ్మసాని చంద్రశేఖర్
నరసారావుపేట : లావు శ్రీకృష్ణదేవరాయులు