Chandrababu Naidu: బాబూ.. రూటు మార్చు.. లేకపోతే 23 సీట్లే దిక్కు! మహానాడులోనూ అదే డబ్బానా?
చంద్రబాబు తనకు తానుగా డబ్బా కొట్టుకోవడం కొత్తేమీ కాదు.. నిజానికి 'ఆయన' గురించి ఆయన చెప్పుకోవడంలో ఆయనకు మించిన వారు లేరు! ఇదేమీ టంగ్ ట్విస్టర్ కాదు.. అక్షర సత్యం..! ఎవరైనా మనల్ని వేరేవాళ్లు పొగడాలని కోరుకుంటారు. ఒకవేళ ఎవరూ ఆ పని చేయకపోతే కామ్‌గా ఉండిపోతారు.
Chandrababu Naidu: ఇంకెంతకాలం ఆత్మస్తుతి.. పరనిందకు పరిమితమవుతారు? తప్పులపై ఆత్మావలోకనం అవసరం లేదా? పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయాల్సిన చోట పొగడ్తలకే పరిమితమయితే ఏంటి లాభం? ఎన్నికల ముంగిట నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ అవసరం లేదా?
చంద్రబాబు తనకు తానుగా డబ్బా కొట్టుకోవడం కొత్తేమీ కాదు.. నిజానికి ‘ఆయన’ గురించి ఆయన చెప్పుకోవడంలో ఆయనకు మించిన వారు లేరు! ఇదేమీ టంగ్ ట్విస్టర్ కాదు.. అక్షర సత్యం..! ఎవరైనా మనల్ని వేరేవాళ్లు పొగడాలని కోరుకుంటారు. ఒకవేళ ఎవరూ ఆ పని చేయకపోతే కామ్‌గా ఉండిపోతారు. కానీ చంద్రబాబు రూటే వేరు. ఆయన డబ్బా ఆయనే కొట్టుకుంటారు. రీసౌండ్ వచ్చేలా వాయించేస్తారు.! మహానాడులోనూ అదే చేశారు. లక్షల మంది జనం మధ్య పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాల్సిన చంద్రబాబు.. సెల్ఫ్ బోస్టింగ్‌కే పరిమితమయ్యారు. ఇది పార్టీ శ్రేణులకే విసుగు తెప్పించింది. విన్న సోదే ఎన్నిసార్లు వినాలిరా బాబు అంటూ సభలో సైలెంట్‌గా ఉండిపోయారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి జనం బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 151 సీట్లు కటబెట్టారు.
అయితే ఈ నాలుగేళ్ల పాలనతో వైసీపీ అనేక విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారంటూ జగన్ పథకాలపై ఫైర్ అవుతున్న పోస్టులు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్న ప్రచారమూ సాగుతోంది. ఇది గ్రౌండ్ లెవల్‌లో ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. జగన్ గ్రాఫ్ 2019తో పొల్చితే ఇప్పుడు పడిపోయిందన్నది మాత్రం నిజం..! ఇంతకు మించిన పెద్ద పస్ల్ పాయింట్ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి మరొకటి ఉండదు. ఇదే ఫ్లోలో టీడీపీ కాస్త బుర్ర పెట్టి పనిచేస్తే కాస్త బెటర్ రిజల్ట్ ఉంటుంది. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లతో చావుదెబ్బ తిన్న టీడీపీకి పుంజుకునే అవకాశమిచ్చారు జగన్. అయితే చంద్రబాబు మాత్రం అసలు ఈ ఛాన్సును యూజ్ చేసుకునేలా కనిపించడంలేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపులే మహానాడు తొలి రోజు సభ!
రాజమండ్రిలో తొలి రోజు నిర్వహించిన ప్రతినిధుల సభ కిక్కిరిసిపోయింది. బహిరంగసభకు వచ్చినంత మంది ప్రతినిధులు వచ్చారు. వేలలో వస్తారనుకుంటే లక్షల్లో వచ్చారు. ఇక బహిరంగసభకు ఎంత మంది వస్తారో చెప్పడం కష్టమే. ఇంత మంది రావడం టీడీపీకి సూపర్ ఫ్లస్. అయితే అక్కడకి వచ్చినవారికి సరైన మార్గం చూపించడంలో మాత్రం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. మరో ఏడాది తిరిగేలోపే అసెంబ్లీ ఎన్నికల రానున్నాయి. వచ్చే మహానాడు సమయానికి కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరే అవకాశముంది. జగన్ ‘ముందస్తు’ వెళ్తున్నారన్న ప్రచారం ఎలాగో ఉంది. ఇలాంటి సమయంలో మహానాడుకు మించిన సభ టీడీపీకి మరొకటి ఉండదు. అయితే ఈ అవకాశాన్ని కూడా చంద్రబాబు సద్వినియోగం చేసుకోలేదు.
ఈ సభలో పార్టీ గెలుపు కోసం చంద్రబాబు యాక్షన్ ప్లాన్ చెబుతారని అంతా భావించారు. అయితే చంద్రబాబు పాత పాటే మళ్లీ మళ్లీ పాడి వినిపించారు. ఏపీ ప్రజల కోసం ప్రధాని పదవిని త్యాగం చేశానని మళ్లీ డబ్బా వాయించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సైతం మౌనంగా ఉండిపోయారు. కొంతమంది పెద్దాయన ఫీల్ అవుతారని కాసేపు ఇంట్రెస్టుగా విన్నట్టు కనిపించారు. అసలు చంద్రబాబు తన గురించి తాను చెప్పుకోవడం దేనికి..? అసలు మహానాడు పెట్టింది ఇలా గొప్పలు చెప్పుకోవడానికా..? ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఇప్పటివరకు చంద్రబాబు వద్ద జగన్ పార్టీని ఓడించేందుకు సరైన ప్లాన్ ఉందా అంటే తెలుగు తమ్ముళ్లు కూడా ‘ఉందని’ గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇలా అయితే ఎలా బాబు..? ఇప్పటికైనా రూటు మార్చు. లేకపోతే మళ్లీ 23యే దిక్కు..!