బాలినేనిని వదలను, ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ కావడం ఏమో గాని ఇప్పుడు రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ముఖ్యంగా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. బాలినేని చేరికపై దామచర్ల జనార్ధన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ కావడం ఏమో గాని ఇప్పుడు రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ముఖ్యంగా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. బాలినేని చేరికపై దామచర్ల జనార్ధన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అవినీతి నుంచి తప్పించుకోవడానికే జనసేనలోకి బాలినేని వెళ్తున్నారు అంటూ మండిపడ్డారు. బాలినేని ఏ పార్టీలో చేరినా ఆయనను ఎవరూ కాపాడలేరు అన్నారు.
బాలినేని, ఆయన కొడుకు దౌర్జన్యాలను ఉపేక్షించబోం అని స్పష్టం చేసారు. ఈ విషయంలో ఎంతదూరమైనా వెళ్లేందుకు వెనుకాడను అన్నారు. ఎన్నికల ముందు బాలినేని టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టించారు అని నా మీద కూడా అనేక కేసులు పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఆయనను జనసేనలోకి ఎలా చేర్చుకుంటున్నారో అర్థంకావడం లేదన్నారు జనార్ధన్.