మంచు ఫ్యామిలీ కోసం రంగంలోకి టీడీపీ ఎంపీ…?

మంచు కుటుంబంలో గొడవలు ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. సినిమా పరిశ్రమలో గొప్ప చరిత్ర కలిగిన మంచు కుటుంబం ఆస్తుల కోసం ఇలా రోడ్డు మీదకు రావడానికి, ఆ కుటుంబాలతో పాటుగా సినిమా పరిశ్రమ పెద్దలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2025 | 11:50 AMLast Updated on: Feb 05, 2025 | 11:50 AM

Tdp Mp To Enter For Manchu Family

మంచు కుటుంబంలో గొడవలు ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. సినిమా పరిశ్రమలో గొప్ప చరిత్ర కలిగిన మంచు కుటుంబం ఆస్తుల కోసం ఇలా రోడ్డు మీదకు రావడానికి, ఆ కుటుంబాలతో పాటుగా సినిమా పరిశ్రమ పెద్దలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా పరిశ్రమలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించిన మోహన్ బాబు తన కుటుంబంలో వచ్చిన సమస్యకు మాత్రం ఇప్పటివరకు పరిష్కారం చూపించలేకపోయారు. ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకుకు మాత్రమే మోహన్ బాబు సపోర్ట్ చేస్తున్నారని, ఆయనకే ఆస్తులు పంచేందుకు ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం చాలా మందిలో కలిగింది.

ఈ విషయంలో మంచు మనోజ్ గట్టిగానే పోరాటం చేస్తున్నాడు. ఇక ఈ పోరాటంలో ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య గట్టిగానే తిరుగుతోంది. మొన్నీమధ్య తిరుపతిలో మంచు మనోజ్ గట్టిగానే హడావిడి చేశాడు. ఇక మంచు మనోజ్ ను తమ యూనివర్సిటీ లోపల కు రానివ్వవద్దంటూ మోహన్ బాబు గట్టిగానే పట్టుదలగా వ్యవహరించారు. ఈ విషయంలో మంచు విష్ణు కూడా కాస్త సీరియస్ గానే బిహేవ్ చేయడంతో సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనబడటం లేదు.

అయితే తనని కావాలనే మంచి మనోజ్ ఇబ్బంది పెడుతున్నాడని, తాను సంపాదించుకున్న ఆస్తులపై ఎవరికి హక్కు లేదని, తాను ఎవరికి ఇవ్వాలి అనుకుంటే ఆ ఆస్తులను వారికే ఇస్తానని మోహన్ బాబు స్పష్టంగా చెబుతున్నారు. తన భార్య మాటలు విని మంచు మనోజ్ తనని ఇబ్బంది పెడుతున్నాడని, మోహన్ బాబు అసహనంగా ఉన్నారు. అసలు ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం మంచు విష్ణు అనేది మంచు మనోజ్ వాదన. ఇక జల్పల్లి ఇంటి గురించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు మోహన్ బాబు ఇటీవల లేఖ రాశారు.

ఆ ఇంటిని అక్రమంగా మంచు మనోజ్ ఆక్రమించాడని, సీనియర్ సిటిజన్ ఆక్ట్ ప్రకారం ఆ ఇంటి నుంచి మంచు మనోజ్ ను బయటకు పంపాలని ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు. ఇక సోమవారం వీళ్ళిద్దరిని కలెక్టర్ విచారించారు. ఇరు వర్గాలు తమ వాదనను బలంగా వినిపించాయి. ఇక ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేని మోహన్ బాబు రీసెంట్ గా తిరుపతి షిఫ్ట్ అయ్యారు. ఫ్యామిలీతో కలిసి తిరుపతిలోనే ఉంటున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ఎంపీ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు సదరు ఎంపీ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మంచు మనోజ్ తో అలాగే మంచు మోహన్ బాబుతో సన్నిహితంగా ఉండే సదరు ఎంపీ ఈ సమస్య పరిష్కారం కోసం ఇరువర్గాలను కూర్చోబెట్టడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే పది రోజుల్లో ఇరువర్గాలను శాంతింప చేసేందుకు సదర ఎంపీ రంగంలోకి దిగినట్లు సమాచారం.