టీడీపీ కొత్త రికార్డ్, ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్

సభ్యత్వ నమోదులో తెదేపా సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆ పార్టీ సభ్యత్వాలు 73 లక్షలకు చేరుకున్నాయని పార్టీ అధిష్టానం ప్రకటన చేసింది. సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు అధినేత చంద్రబాబు నాయుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2024 | 03:25 PMLast Updated on: Dec 14, 2024 | 3:25 PM

Tdp Sets New Record In Membership Registration

సభ్యత్వ నమోదులో తెదేపా సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆ పార్టీ సభ్యత్వాలు 73 లక్షలకు చేరుకున్నాయని పార్టీ అధిష్టానం ప్రకటన చేసింది. సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు అధినేత చంద్రబాబు నాయుడు. క్యాడర్, నాయకులకు అభినందనలు చెప్పారు ఈ సందర్భంగా. టాప్ 5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు నిలిచాయి.

నూతన సభ్యత్వాలకు పెద్ద సంఖ్యలో యువత, మహిళలు ఆసక్తి చూపించారు. క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందని పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదన్నారు. ప్రజలు, పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదని వ్యాఖ్యానించారు. కష్టపడనిదే ఏదీ రాదనే విషయం ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు చంద్రబాబు. కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలని సూచించారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారన్నారు చంద్రబాబు. .