టీడీపీ మహిళా ఎమ్మెల్యే రాజీనామా…? అనవసరంగా ఇరుక్కుపోయారా…?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నూజివీడులో జరిగిన ఒక వ్యవహారం తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా తలనొప్పిగా మారింది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా నూజివీడు ఎమ్మెల్యే మంత్రి పార్థసారథి అలాగే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వైసీపీ నేత జోగి రమేష్ కూడా హాజరై సంచలనం సృష్టించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2024 | 02:04 PMLast Updated on: Dec 18, 2024 | 2:04 PM

Tdp Woman Mla Resigns

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నూజివీడులో జరిగిన ఒక వ్యవహారం తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా తలనొప్పిగా మారింది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా నూజివీడు ఎమ్మెల్యే మంత్రి పార్థసారథి అలాగే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వైసీపీ నేత జోగి రమేష్ కూడా హాజరై సంచలనం సృష్టించారు. వీరు ముగ్గురు ఒకే వాహనంపై కనపడటంతో చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

దీనిపై గౌతు శిరీష అలాగే మంత్రి పార్థసారథి ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పారు. తమకు తెలియకుండా జరిగిన పరిణామం అని… తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మోసం చేయలేదని క్షమించాలని కూడా కోరారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం విషయంలో గౌతు శిరీషను చాలామంది టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆమె టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అలాగే పార్టీ నేతలు కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఒక నేత ఆమెకు సున్నితంగా హెచ్చరికలు కూడా ఇచ్చారట.

ఇది ఎంతవరకు నిజం అనే దానిపై క్లారిటీ లేదు. కానీ గౌతు శిరీష మాత్రం ఈ వ్యవహారం ఇంతకంటే పెద్దదైతే అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తన తప్పు లేకపోయినా కావాలనే ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారు అనే అభిప్రాయంలో కూడా గౌతు శిరీష ఉన్నట్లు సమాచారం. దీనిపై తన తండ్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ తో ఆమె చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.

అవసరమైతే దీనికి సంబంధించి అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి వివరణ ఇవ్వడానికి కూడా శిరీష సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికి మంత్రి నారా లోకేష్ అపాయింట్మెంట్ కూడా శిరీష కోరినట్లు సమాచారం. అయితే లోకేష్ బిజీగా ఉండటం చంద్రబాబు నాయుడు కూడా పలు కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం. ఇక మంత్రి పార్థసారథితో కూడా ఇప్పటికే ఆమె మాట్లాడారు. అయితే వివాదం ఇప్పట్లో ముగిసిపోయే అవకాశం స్పష్టంగా కనబడటం లేదు.

దీనితో ఆమె రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తన సన్నిహితులు వద్ద ఆమె అసహనంగా కూడా చెప్పారట. తాను గత ఐదేళ్లుగా ఎన్నో కష్టాలు పడ్డానని, తనను మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఎన్నో వేధింపులకు గురి చేశారని అయినా సరే తట్టుకుని నిలబడి తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడ్డాను అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోగతం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిప్రాయాలు తనకు తెలుసని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తితో ఎందుకు తను మాట్లాడుతాను అంటూ ఆమె తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట.

అంతేకాకుండా జోగి రమేష్ వ్యక్తిత్వం గత ఐదేళ్ల నుంచి తాను మీడియాలో చూశానని అతను మాట్లాడిన మాటలు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి వెళ్ళిన విషయం కూడా తనకు స్పష్టత ఉందని అలాంటి వ్యక్తిపై తనకు ఏ విధంగా మంచి అభిప్రాయం ఉంటుందని, సమాజంలో ఎంతో పేరున్న కుటుంబం తమదని, కాబట్టి తాను ఇటువంటి కార్యక్రమాలు చేయను అని తన సన్నిహితులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఒకవేళ ఈ విషయంలో పార్టీ అధిష్టానం తనను దోషిగా చూస్తే మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అంటూ కూడా గౌత శిరీష చెప్పినట్లు తెలుస్తోంది.