కెసిఆర్ ఉచ్చు లో తీన్మార్ మల్లన్న , తీన్మార్ మల్లన్న కోసం హరీష్ రావు ఆపరేషన్
తెలంగాణ లో ప్రాంతీయవాదం ముగిసి కులవాదం పడక విప్పడంతో, ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ బీసీ నినాదం బాగా వినిపిస్తోంది.2028 తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది.

తెలంగాణ లో ప్రాంతీయవాదం ముగిసి కులవాదం పడక విప్పడంతో, ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ బీసీ నినాదం బాగా వినిపిస్తోంది.2028 తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణలో బీసీ కులాల నాయకులకు డిమాండ్ పెరుగుతోంది. బీసీ నినాదం ఎత్తుకొని రెడ్లను, కాంగ్రెస్ నేతలను నానా బూతులు తిట్టిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ను ఆకట్టుకునే పనిలో పడింది బి ఆర్ ఎస్. ఈ విషయంలో చాలా వేగంగా పావులు కదిపిన కెసిఆర్, హరీష్ రావు ద్వారా మల్లన్న చుట్టూ కొందరు బిఆర్ఎస్ బీసీలను ప్రవేశపెట్టారు. తద్వారా మూడు ఏళ్ల ముందే చింతపండు నవీన్ ని ఫిక్స్ చేసే వ్యూహం పన్నింది బి ఆర్ ఎస్ పార్టీ.
ఎవరు మాటలెక్కువ మాట్లాడగలుగుతారో, ఎవరు మాటలతో ప్రత్యర్ధుల్ని చీల్చి చెండాడగలుగుతారో వాళ్లే తెలంగాణలో రాజకీయం చేయగలుగుతారు. మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి ఉండదు. నాయకుడు అనే వాడు ఏం చేసినా చేయకపోయినా అద్భుతంగా మాట్లాడితే చాలు తెలంగాణలో పొలిటికల్ లీడర్ గా సెటిలైపోవచ్చు. కెసిఆర్ అడ్వాంటేజ్ కూడా అదే. అద్భుతమైన మాటకారి అయిన
చంద్రశేఖర రావు ఆ మాటలతోనే ఉద్యమం నడిపాడు, ఆ మాటలతోనే పది ఏళ్ల పాలన చేశాడు. ఇదే ఫార్ములా ఫాలో అయ్యి రేవంత్ రెడ్డి కూడా టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మీడియాలో ఓ చిన్న ఉద్యోగాన్ని వదులుకొని ఈ నోరు పెట్టుకునే ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా అయ్యాడు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ ఓటమికి పది కారణాల్లో తీన్మార్ మల్లన్న కూడా ఒకడు. కెసిఆర్ కుటుంబంపై మల్లన్న నెగిటివ్ ప్రచారం ఎన్నికల్లో కాంగ్రెస్ కి చాలా ఉపయోగపడింది. అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మల్లన్నకు ఫండింగ్ చేసి, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి నిత్యం కెసిఆర్ ని తిట్టిస్తూ ఉండేవారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నారు. తీన్మార్ మల్లన్న అనే అనామకుడి కి అన్ని రకాలుగా సహకరించి ఎమ్మెల్సీ స్థాయికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి.
ఎమ్మెల్సీ అయ్యాక చింతపండు నవీన్ కాంగ్రెస్ కి అడ్డం తిరిగాడు.
బీసీ నినాదం ఎత్తుకొని రెడ్లను నానా బూతులు తిట్టడం మొదలెట్టాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో చాలామంది రేవంత్ ని నిందిస్తున్నారు. తీన్మార్ మల్లన్న అనే వాడిని తయారు చేసింది రేవంత్. ఇప్పుడు అతనే కాంగ్రెస్ పరువు తీస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు తీన్మార్ మల్లన్న పై దాడులు చేయించి, కేసులు పెట్టించి, జైల్లో వేసి నా నా రకాలుగా హింసించిన కేసీఆర్…. ఇప్పుడు హఠాత్తుగా వ్యూహం మార్చాడు. చింతపండు నవీన్ కాంగ్రెస్ కి అడ్డం తిరగ గానే…. అతన్ని తన వైపు లాక్కోవాలని నిర్ణయించాడు కేసీఆర్.
ఆ పనిని హరీష్ రావుకు అప్పజెప్పాడు. హరీష్ రావు అనుచరుల్లో కొందరు బీసీలు వెంటనే మల్లన్న చెంతకు చేరారు. తెలంగాణలో ఇక ప్రత్యేక రాష్ట్ర వాదన పనిచేయదని, ఆంధ్రా వాళ్ళని తిట్టి తెలంగాణలో ఓట్లు వేయించుకునే ప్లాన్ ఇప్పుడు ఇక వర్క్ అవుట్ కాదని, రాబోయే రోజుల్లో జనాన్ని కులం పేరిట డివైడ్ చేయాల్సిన అవసరం ఉందని, అందుకే బీసీ నినాదం ఎత్తుకోవడం ద్వారా జనాభాలో అత్యధికంగా ఉన్న వారి ఓట్లను కొల్లగొట్టాలని పార్టీలు డిసైడ్ అయ్యాయి. నీలో భాగంగానే హరీష్ రావు అనుచరులు కొందరు తెలివిగా మల్లన్న పక్కన చేరారు. ఒకప్పుడు కెసిఆర్ ఆఫీసులో పనిచేస్తూ…. అవినీతి ఆరోపణలపై గెంటి వేయబడిన ఒక బి ఆర్ ఎస్ బీసీ కార్యకర్త ఏకంగా ఇప్పుడు మల్లన్న పక్కన చేరాడు.
అతనితోపాటు మరికొందరు బీసీ మాస్క్ తో తీన్మార్ మల్లన్న నీ కవర్ చేస్తున్నారు. అలాగే చింతపండు నవీన్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు హరీష్ రావుకు చేరవేస్తున్నారు. బీసీ ఉద్యమానికి కావలసిన నిధులు సమీకరించడం, ఇతరత్రా సహకారం బి ఆర్ ఎస్ ద్వారానే అందుతోంది. నవీన్ పక్కనబి ఆర్ఎస్ కార్యకర్తలు, హరీష్ రావు అనుచరు లను చూసి తెలంగాణ బీసీ నాయకులు షాక్ తిన్నారు. పదేళ్ల కెసిఆర్ కుటుంబ పాలన్నీ, కెసిఆర్ అవినీతిని ఎండగట్టి.. ఆ కేసుల్లో జైలు కెళ్ళి… చివరికి మల్లన్న ఇలా వాళ్లతోనే చేతులు కలవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. బీసీ సభలకు, ఇతరత్రా కార్య కలాపాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పుడు అర్థమైంది .కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కెసిఆర్ ఈసారి బీసీలను రెచ్చగొట్టి…. మల్లన్న ద్వారానే ఆ పని చేయిస్తున్నాడనేది చాలామంది చర్చించుకుంటున్నారు. ఏ ఆయుధాన్ని అయితే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కేసీఆర్ పై ప్రయోగించాడో, అదే ఆయుధాన్ని ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ పై ప్రధానంగా రేవంత్ రెడ్డి పై ప్రయోగించబోతున్నారు. తీన్మార్ మల్లన్న రేవంత్ ఉచ్చు నుంచి బయటపడి కెసిఆర్ ఉచ్చులో చిక్కుకున్నాడు.