TELANGANA BJP: సీనియర్లు ఎక్కడ..? ఇంచార్జిల లిస్ట్‌లో లేని ఈటల పేరు.. బీజేపీ ఏం చెప్పాలనుకుంటోంది..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8మంది ఎమ్మెల్యేలతో పాటు.. పలువురు సీనియర్ నేతలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇంచార్జీల్లో సీనియర్లు పెద్దగా కనిపించడం లేదు. దీంతో బీజేపీ వ్యూహం ఏంటా అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Telangana BJP whose path is theirs..!
TELANGANA BJP: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8స్థానాలకే పరిమితమైన కాషాయం పార్టీ.. ఎంపీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తోంది. పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు మెుదలుపెట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇంఛార్జులను నియమించారు. పార్టీ కేడర్‌ను సమన్వయ పరుచుకుంటూ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ ఇంఛార్జులు పని చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
REVANTH VS NANI: కొడాలి నానిని రానీయొద్దు! నో ఎంట్రీ అంటున్న రేవంత్..
కరీంనగర్ నుంచి బండి సంజయ్.. ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీలుగా ఉన్నారు. ఐతే వీళ్లలో ఎవరికీ ఇంఛార్జులుగా బాధ్యతలు అప్పగించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8మంది ఎమ్మెల్యేలతో పాటు.. పలువురు సీనియర్ నేతలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇంచార్జీల్లో సీనియర్లు పెద్దగా కనిపించడం లేదు. దీంతో బీజేపీ వ్యూహం ఏంటా అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇక పార్టీ కీలక నేతలైన.. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించలేదు. మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ఈటలను ఎందుకు పక్కనపెట్టారనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఐతే వీళ్లందరికీ బాధ్యతలు అప్పగించకపోవడం వెనక.. బీజేపీ పరోక్ష సందేశం ఉంది అన్నది మరికొందరి వాదన. కీలక నేతలందరికీ టికెట్లు దాదాపు కన్ఫార్మ్ అయినట్లే. అలాంటి వారికి ఇంచార్జిగా మరో బాధ్యత అప్పగిస్తే ఎన్నికల సమయంలో ఇబ్బంది అవడం ఖాయం.
ఇంచార్జీల ప్రకటనతో బీజేపీ చెప్పాలనుకునేది అదే అనే చర్చ జరుగుతోంది. ఈటల కూడా పార్లమెంట్ బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా ఉన్నారు కూడా! ఇక పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. 10 ఎంపీ సీట్లు గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. 35 శాతం ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటు మోదీ కూడా తెలంగాణలో ప్రచారానికి రాబోతున్నారు. ఈ నెల 13 నుంచే ప్రచార బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.