T BJP: 12 ఎంపీ స్థానాలపై ఫోకస్ చేసిన బీజేపీ.. తెలంగాణలో ఎంపీ అభ్యర్థులు వీళ్లే..
తెలంగాణలో బలపడేందుకు చాన్స్ ఉందని భావిస్తున్న బీజేపీ హైకమాండ్.. పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 12 స్థానాలపై దృష్టిసారించింది.
T BJP: అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా.. బీజేపీ భారీగా ఓటు బ్యాంక్ పెంచుకుంది. 8స్థానాల్లో గెలిచిన కమలం పార్టీ.. 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. 40కి పైగా స్థానాల్లో డిపాజిట్ దక్కించుకుంది. దీంతో తెలంగాణలో బలపడేందుకు చాన్స్ ఉందని భావిస్తున్న బీజేపీ హైకమాండ్.. పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది.
YSRCP: ఇంఛార్జిల మార్పుతో వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. మరిన్ని మార్పులకు రెడీ అవుతున్న జగన్
తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 12 స్థానాలపై దృష్టిసారించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది బీజేపీ. 2024లో 12 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది బీజేపీ. ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, మహబూబాబాద్ స్థానాలపై కమలం పార్టీ అంతగా ఫోకస్ పెట్టడం లేదు. మిగిలిన 12 పార్లమెంట్ స్థానాలపై కసరత్తు మొదలుపెట్టింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి.. ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్.. 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.
వచ్చే ఎన్నికల్లోనూ ఆ స్తానాల నుంచి ఈ నలుగురే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్. ఈ నాలుగు స్థానాలతో పాటు పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, చేవేళ్ల, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి ప్రధాని మోదీ కూడా పోటీ చేయాలని.. ఇక్కడి నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. మోదీ వస్తే రాజకీయంగా తమకు ప్లస్ అవుతుందన్నది వాళ్ల ఆలోచన. ఆ నలుగురి సంగతి ఎలా ఉన్నా.. మిగతా స్థానాల నుంచి పోటీ చేయబోయేది వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం ఊపందుకుంది. ఎంపీ టికెట్ కోసం బీజేపీలో భారీ పోటీ కనిపిస్తోంది. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, దిలీప్ ఆచారిలో ఒకరికి టికెట్ దక్కే చాన్స్ ఉంది.
PM MODI: సికింద్రాబాద్ నుంచి మోడీ.. మెదక్ నుంచి సోనియా.. అగ్రనేతలిద్దరూ తెలంగాణ నుంచే పోటీ?
ఇక అటు చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్ పోటీ పడుతున్నారు. మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, కూన శ్రీశైలం గౌడ్, చాడ సురేష్ రెడ్డి మధ్య పోటీ కనిపిస్తోంది. మెదక్ నుంచి రఘునందన్‌రావుకు.. నల్గొండ నుంచి సునీతారెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయ్. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ నుంచి భారీ పోటీ కనిపిస్తోంది. చికోటి ప్రవీణ్‌తో పాటు ఎమ్మెల్యే రాజా సింగ్, సంగప్ప, ఆకుల విజయ పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. వరంగల్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, భువనగిరి నుంచి బూరనర్సయ్య గౌడ్‌కు టికెట్ దాదాపు కన్ఫార్మ్ అయినట్లే. ఇక అటు హైదరాబాద్ నుంచి భగవంతరావుతో పాటు ఇక్కడే సెటిల్ అయిన ఓ నార్త్ ఇండియన్‌కు టికెట్ ఇచ్చే విషయంపై చర్చ జరుగుతోంది. ఖమ్మం, మహబూబాబాద్ నుంచి బలమైన అభ్యర్థి కోసం బీజేపీ వేట మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు సరి చేసుకుంటూనే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ చిన్న పొరపాటు కూడా దొర్లకుండా.. 8 నుంచి 12 స్థానాలు గెలుచుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.