Raja Singh Lodh: బీజేపీలో రాజాసింగ్‌కు మళ్లీ షాక్‌..

రాజాసింగ్‌కు మరో షాక్‌ తగిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి 8మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో అందరికంటే సీనియర్‌.. రాజాసింగే! ఆయనకు కాదని.. మరొకరికి బీజేఎల్పీ నేతగా అవకాశం దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 8, 2024 | 07:01 PMLast Updated on: Feb 08, 2024 | 7:01 PM

Telangana Bjp Gives Shock To Raja Singh Assembly Floor Leader Given To Maheshwar Reddy

Raja Singh Lodh: బీజేపీలో రాజాసింగ్‌కు మరో షాక్ తగిలిందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కమలం పార్టీ తరఫున తన గళం వినిపించారు. ఐతే ఆ తర్వాత రాజా సింగ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత సరిగ్గా ఎన్నికల ముందు దాన్ని ఎత్తివేసి మళ్లీ టికెట్ ఇచ్చారు. అదే షాక్ అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ రాజాసింగ్‌కు మరో షాక్‌ తగిలినట్లు తెలుస్తోంది.

KCR: అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా.. రారా.. కారణమేంటి..?

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి 8మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో అందరికంటే సీనియర్‌.. రాజాసింగే! ఆయనకు కాదని.. మరొకరికి బీజేఎల్పీ నేతగా అవకాశం దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డిని తాత్కాలిక బీజేఎల్పీ లీడర్‌గా అంగీకరిస్తూ మిగిలిన ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన కాపీని స్పీకర్‌కు అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. బీజేపీ తరపున BAC సమావేశానికి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. మహేశ్వర్ రెడ్డి నియామకంపై బీజేపీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మహేశ్వర్ రెడ్డిని తాత్కాలిక బీజేఎల్పీ లీడర్‌గా అంగీకరిస్తూ.. మిగిలిన ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన కాపీని స్పీకర్‌కు అందజేశారు. అయితే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్.. సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం.

బీజేపీ స్టేట్ చీఫ్‌ కిషన్ రెడ్డి ఫోన్ చేసి సర్ది చెప్పడంతో పాయల్ శంకర్ సంతకం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి అసెంబ్లీలో 8 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఆరుగురు ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిన వారే. రాజాసింగ్ ఒక్కరే హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాగా.. మహేశ్వర్ రెడ్డి 2009లో ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని రాజాసింగ్‌తో పాటు పాయల్ శంకర్ కూడా ఆశించారు. అయితే అన్ని సమీకరణాలు పరిశీలించిన తర్వాత బీజేఎల్పీ లీడర్‌గా మహేశ్వర్ రెడ్డిని నియమించేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం.