T BJP: కాంగ్రెస్‌లోకి వెళ్లబోతున్న ఆ నలుగురు బీజేపీ నేతలు!?
బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుంది అనుకున్న బీజేపీకి ఇప్పుడు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అనేది కొందరు వాదన. కేసీఆర్‌ను గద్దె దించడం సంగతి పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూడా ఉంటామో.. లేదో.. తెలియని పరిస్థితిలో ఉన్నారట కొందరు బీజేపీ నేతలు.
T BJP: మొన్నటి వరకూ తెలంగాణలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోయిన బీజేపీ పరిస్థితి ఇప్పుడు మాత్రం దారుణంగా మారిపోయింది. కొన్ని రోజుల నుంచి వరుసగా మారుతున్న పరిస్థితులతోపాటు, నేతల మధ్య వర్గపోరుతో పార్టీ బలహీనంగా మారింది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుంది అనుకున్న బీజేపీకి ఇప్పుడు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అనేది కొందరు వాదన. కేసీఆర్‌ను గద్దె దించడం సంగతి పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూడా ఉంటామో.. లేదో.. తెలియని పరిస్థితిలో ఉన్నారట కొందరు బీజేపీ నేతలు.
దీంతో పార్టీ మారేందుకు పక్క చూపులు చూస్తున్నారట. రీసెంట్‌గానే సీక్రెట్‌గా ఓ మీటింగ్ కూడా నిర్వహించుకున్నారట. పార్టీ మారితే వచ్చే లాభ నష్టాలు, ఏ పార్టీలో చేరితే ఫ్యూచర్ బాగుటుంది అనే అంశాలపై నేతలు చర్చించినట్టు టాక్ నడుస్తోంది. ఇందులో చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారట. కొన్ని రోజుల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. బీఆర్‌ఎస్ మీద ఉన్న వ్యతిరేకతను తమ ఓట్‌బ్యాంక్‌గా మార్చుకోవడంలో కాంగ్రెస్ నేతలు కాస్త మెరుగ్గా పని చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో చేరేందుకే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే జరిగితే వచ్చే ఎన్నికల వరకూ కాదు.. కొద్ది రోజుల్లోనే తెలంగాణలో బీజేపీ పతనం కావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ నుంచి ప్రధానంగా నలుగురు కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది.