TELANGANA BJP: నామినేషన్లకు ఒక్క రోజే గడువు.. 11 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయని బీజేపీ..
కొన్ని చోట్ల అభ్యర్థుల విషయంలో సందేహాలున్నా.. కొందరు మాత్రం నామినేషన్లు దాఖలు చేశారు. వారికి పార్టీలు బీఫాంలు అందించాల్సి ఉంది. ఇలా అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ఎంపిక చేసి, నామినేషన్లు కూడా వేయిస్తున్నాయి. కానీ, బీజేపీ మాత్రం ఇంకా 11 స్థానాల్ని పెండింగులో పెట్టింది.
TELANGANA BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TELANGANA ASSEMBLY ELECTIONS) నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల గడువు నవంబర్ 10, శుక్రవారంతో ముగియనుంది. అంటే.. ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువుంది. అయినప్పటికీ బీజేపీ (BJP) ఇప్పటికీ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ మినహా పార్టీలన్నీ అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. కొన్ని చోట్ల అభ్యర్థుల విషయంలో సందేహాలున్నా.. కొందరు మాత్రం నామినేషన్లు దాఖలు చేశారు.
REVANTH REDDY: కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులా..? బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు జరగవు: రేవంత్ రెడ్డి
వారికి పార్టీలు బీఫాంలు అందించాల్సి ఉంది. ఇలా అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ఎంపిక చేసి, నామినేషన్లు కూడా వేయిస్తున్నాయి. కానీ, బీజేపీ మాత్రం ఇంకా 11 స్థానాల్ని పెండింగులో పెట్టింది. దీనికి వేర్వేరు కారణాలున్నాయి. బీజేపీ తరఫున చాంద్రాయణ గుట్ట నుంచి పోటీ చేయాల్సిన అభ్యర్థి.. చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని స్థానాల్లో మాత్రం ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం లేక పోవడంతో అభ్యర్థుల ఎంపిక వాయిదా పడింది. దీంతో కొన్ని స్థానాలు పెండింగులో ఉన్నాయి. ఈ స్థానాల్లో టిక్కెట్లు తమ వారికే ఇవ్వాలని కీలక నేతలు పట్టుబడుతున్నారు. ఇంకొన్ని చోట్ల అధికారికంగా ప్రకటించకున్నా పోన్ చేసి నామినేషన్ వేసుకొమ్మని చెప్పిన బీజేపీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ముందుగా నామినేషన్ వేసి.. తర్వాత పార్టీల బీఫాం (B FORMS) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్లకు శుక్రవారమే చివరి రోజు కావడంతో.. అభ్యర్థులంతా నామినేషన్లు వేస్తున్నారు.
BRS, KTR : బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. ప్రచార వాహనం నుంచి కింద పడ్డ మంత్రి కేటీఆర్..
ఆ తర్వాత పార్టీల బీ ఫాం అందజేయాలని భావిస్తున్నారు. రేపటి లోపు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఏ ఫామ్, బీ ఫామ్ ఆర్వోకు అందజేయాలి. ఏ ఫామ్, బీ ఫామ్ ఇవ్వని అభ్యర్థులను ఎన్నికల కమిషన్ స్వతంత్ర అభ్యర్ధులుగా గుర్తిస్తుంది. బీ ఫామ్ ఇవ్వకుండానే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు బీ ఫామ్ ఇవ్వని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో పార్టీ బీ ఫాంల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.