Telangana Cabinet: మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖ..
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. ప్రమాణ స్వీకార అనంతరం రేవంత్ సచివాలయానికి బయల్దేరారు.
Telangana Cabinet: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. ప్రమాణ స్వీకార అనంతరం రేవంత్ సచివాలయానికి బయల్దేరారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ నూతన క్యాబినెట్ తొలి భేటీ జరగబోతుంది. ఈ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి.
మల్లు భట్టి విక్రమార్క: డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి: హోం
శ్రీధర్ బాబు: ఆర్థిక శాఖ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి: పురపాలక శాఖ
తుమ్మల నాగేశ్వరరావు: రోడ్లు, భవనాల శాఖ
జూపల్లి కృష్ణారావు: పౌర సరఫరాల శాఖ
సీతక్క: గిరిజన సంక్షేమ శాఖ
కొండా సురేఖ: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి: నీటిపారుదల శాఖ.
దామోదర రాజనర్సింహ: ఆరోగ్య శాఖ
పొన్నం ప్రభాకర్: బీసీ సంక్షేమ శాఖ