Telangana Cabinet: కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. మంత్రుల ప్రొఫైల్ ఇదే..
ఇచ్చిన మాట ప్రకారం పార్టీ సీనియర్లందరికీ న్యాయం చేస్తూ కేబినెట్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్‌ను సీఎం చేయగా, కీలక మత్రిత్వ శాఖలను సీనియర్ నేతలకు కేటాయించింది.
Telangana Cabinet: ఎట్టకేలకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇచ్చిన మాట ప్రకారం పార్టీ సీనియర్లందరికీ న్యాయం చేస్తూ కేబినెట్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్‌ను సీఎం చేయగా, కీలక మత్రిత్వ శాఖలను సీనియర్ నేతలకు కేటాయించింది. ఎవరెవరికి ఏ శాఖలు దక్కాయి.. వారి రాజకీయ నేపథ్యం వంటి వివరాలివి.
మల్లు భట్టి విక్రమార్క (మధిర): డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
విద్యార్హతలు: బీఏ
ఎమ్మెల్సీ: 2007 నుంచి 2009
ఎమ్మెల్యే: 2009, 2014, 2019, 2023
పదవులు: ప్రభుత్వ విప్, ఉప సభాపతి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎల్పీ నేత
ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజూర్‌నగర్): హోం
విద్యార్హత: బీఎస్సీ
భారత వైమానిక దళంలో మాజీ ఫైటర్ పైలట్
రాజకీయ అరంగేట్రం: 1994
ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2014, 2018, 2023
ఎంపీ: 2009 (నల్గొండ)
పదవులు: గృహ నిర్మాణ శాఖ మంత్రి, 2004లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, 2015 పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు
దామోదర రాజనర్సింహ (ఆందోల్): ఆరోగ్య శాఖ
1989లో రాజకీయ అరంగేట్రం
ఎమ్మెల్యే: 1999, 2004,2009, 2023
పదవులు: ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ): పురపాలక శాఖ
విద్యార్హత: ఇంజినీరింగ్
ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2014
ఎంపీ: 2019 (భువనగిరి)
అనుభవం: ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు (మంథని): ఆర్థిక శాఖ
విద్యార్హత: ఎం.ఎ, ఎల్.ఎల్.బి
రాజకీయ అరంగేట్రం: 1999
ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2018, 2023
పదవులు: పౌరసరఫరాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (పాలేరు): నీటిపారుదల శాఖ
విద్యార్హతలు: దూరవిద్యలో డిగ్రీ, ఎల్.ఎల్.బి
రాజకీయ అరంగేట్రం: 2013లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్
2014లో వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు
2014లో లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలుపు
2016లో తెరాసలో చేరిక
2023లో కాంగ్రెస్‌లో చేరిక
పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్): బీసీ సంక్షేమ శాఖ
విద్యార్హతలు: ఎం.ఏ, ఎల్.ఎల్.బి
ఎంపీ: కరీంనగర్ (2009-14)
అనుభవం: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ మార్క్‌ఫెడ్ ఛైర్మన్
కొండా సురేఖ (వరంగల్ తూర్పు): స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
విద్యార్హత: బీకాం
రాజకీయ అరంగేట్రం: 1995లో మండల పరిషత్ ప్రెసిడెంట్
ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2023
పదవులు: మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి
2014లో తెరాసలో చేరిక
2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరిక
దనసరి అనసూయ అలియాస్ సీతక్క (ములుగు): గిరిజన సంక్షేమ శాఖ
విద్యార్హతలు: పీహెచ్‌డీ
1996 వరకు మావోయిస్టుగా అడవి జీవితం
రాజకీయ అరంగేట్రం: 2004లో తెదేపాలో చేరిక
ఎమ్మెల్యే: 2009, 2019, 2023
2017లో కాంగ్రెస్‌లో చేరిక
పదవులు: ఏఐసీసీ కాంగ్రెస్ మహిళా కార్యదర్శి
తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం): రోడ్లు, భవనాల శాఖ
విద్యార్హత: డిగ్రీ
1978లో రాజకీయ అరంగేట్రం
ఎమ్మెల్యే: 1985, 1994, 1999, 2009, 2014, 2023
పదవులు: భారీ నీటిపారుదల, చిన్న నీటిపారుదల మంత్రి, రోడ్లు, భవనాలు, మహిళా శిశు సంక్షేమం, ఆబ్కారీ శాఖ మంత్రి
2014లో తెరాసలో చేరిక
2015లో ఎమ్మెల్సీ
జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్): పౌర సరఫరాల శాఖ
ఎమ్మెల్యే: 2004, 2009, 2012, 2014
పదవులు: ఆహార, పౌరసరఫరాల శాఖ, దేవాదాయ శాఖ మంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
2011లో తెరాసలో చేరిక
2023లో కాంగ్రెస్‌లో చేరిక