నేడే తెలంగాణా కేబినేట్ భేటీ…? అన్నీ సంచలనాలే
నేడు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను తెలంగాణా కేబినేట్ చర్చించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరగనుంది.
నేడు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను తెలంగాణా కేబినేట్ చర్చించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరగనుంది. మంత్రులు, సి ఎస్ శాంతి కుమారి,ప్రభుత్వ సలహాదారులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరు కానున్నారు. క్యాబినెట్ లో ప్రధానంగా వివిధ అంశాలకు సంబంధిచి సబ్ కమిటీ నివేదికలు ఇచ్చినందున బీసీ కులగణన… ఎస్సీ వర్గీకరణ, 317 జీవో, ఉద్యోగులకు డిఏలు, ధాన్యం కొనుగోలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ధరణి కమిటీ నివేదిక ప్రకారం ధరణి పేరు మార్పుతో పాటు కొత్త ఆర్ఓఆర్ చట్టం పై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సబ్ కమిటీ నివేదిక ప్రకారం రైతు భరోసా పై ప్రకటన చేయనున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంది. మూసి నిర్వాసితులకు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఇండ్లు కేటాయించాలని క్యాబినెట్లో నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది.