TELANGANA CABINET: రేవంత్ కేబినెట్‌లో మరో 6 బెర్తులు ఖాళీ.. అవకాశం దక్కేదెవరికి..?
తెలంగాణ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. రేవంత్ రెడ్డితో పాటు 11మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరో ఆరు మినిస్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయ్. ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల కోసం పోటీ పడుతున్న వారి లిస్టు పెద్దదిగానే ఉంది.
TELANGANA CABINET: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం రేవంత్‌తో పాటు పది మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ సర్కార్ మొదటి మంత్రివర్గ సమావేశం కూడా పూర్తయింది. రుణమాఫీ, మహిళలకు బస్సు ప్రయాణంలాంటి వాటిపై నిర్ణయాలు కూడా తీసేసుకున్నారు. ఐతే తెలంగాణ కొత్త కేబినెట్‌లో మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయ్. దీంతో ఈ ఆరు పదవులు ఎవరికీ దక్కనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. రేవంత్ రెడ్డితో పాటు 11మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరో ఆరు మినిస్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయ్. ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల కోసం పోటీ పడుతున్న వారి లిస్టు పెద్దదిగానే ఉంది.
CM REVANTH REDDY: హాస్పిటల్‌లో కేసీఆర్.. వైరల్ అవుతున్న సీఎం రేవంత్ ట్వీట్
ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉమ్మడి ఖమ్మం నుంచి అత్యధికంగా ముగ్గురికి అవకాశం దక్కింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కేబినెట్‌లో ఉన్నారు. నల్గొండ నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డి, కరీంనగర్ నుంచి పొన్నం, దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. మెదక్ జిల్లా నుంచి దామోదర రాజనర్సింహకు చోటు దక్కింది. ఉమ్మడి వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో అవకాశం దక్కలేదు. దీంతో మిగిలిన ఆరు బెర్తుల్లో ఈ జిల్లాలకు చెందిన నాయకులకే దక్కే అవకాశాలు ఉన్నాయ్. ఐతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే.. కేవలం 4 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇందులో వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కు అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశమిచ్చారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం పోటీ పడుతున్నారు. అయితే మంత్రివర్గంలో ఇప్పటికే నలుగురు రెడ్లు ఉండటంతో.. ఈ ఇద్దరిలో ఒకరికి మాత్రమే చాన్స్ దక్కనుంది. ఆదిలాబాద్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 4స్థానాల్లో విజయం సాధించింది. ఈ జిల్లా నుంచి ఒకరికి లేదా ఇద్దరికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.
రేసులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, షబ్బీర్ అలీ మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మైనార్టీని కేబినెట్‌లోకి తీసుకోవాలని భావిస్తే షబ్బీర్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయ్. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉంటే.. ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. రాష్ట్ర రాజధాని కావడంతో ఇక్కడి నుంచి కనీసం ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ ఒక్క సీటు కోసం ఫిరోజ్ ఖాన్, అంజన్‌కుమార్ యాదవ్, మధు యాష్కిగౌడ్, మైనంపల్లి హన్మంతరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయ్.