Praja Bhavan : ప్రజాభవన్ వద్దంటున్న రేవంత్ !

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మారక ముందు వరకూ ఉంటున్న సీఎం క్యాంపాఫీస్ ప్రగతిభవన్.. ఇక తనకు వద్దంటున్నారు కొత్త సీఎం రేవంత్ రెడ్డి. రాచరికానికి చిహ్నంగా, గడీలను గుర్తు చేసే ప్రగతి భవన్ లో తాను నివాసం ఉండబోనని తేల్చేశారు. దాన్ని జ్యోతిభాపూలే ప్రజాభవన్ గా పేరు మార్చినా.. రేవంత్ మాత్రం సీఎం క్యాంపాఫీస్ గా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని వాడుకోవాలని భావిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2023 | 01:11 PMLast Updated on: Dec 11, 2023 | 1:15 PM

Telangana Chief Minister Revanth Does Not Want Praja Bhavan

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మారక ముందు వరకూ ఉంటున్న సీఎం క్యాంపాఫీస్ ప్రగతిభవన్.. ఇక తనకు వద్దంటున్నారు కొత్త సీఎం రేవంత్ రెడ్డి. రాచరికానికి చిహ్నంగా, గడీలను గుర్తు చేసే ప్రగతి భవన్ లో తాను నివాసం ఉండబోనని తేల్చేశారు. దాన్ని జ్యోతిభాపూలే ప్రజాభవన్ గా పేరు మార్చినా.. రేవంత్ మాత్రం సీఎం క్యాంపాఫీస్ గా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని వాడుకోవాలని భావిస్తున్నారు.

RK, Alla Ramakrishna Reddy : వైసీపీకి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా !

కేసీఆర్ వాస్తు ప్రకారం ముచ్చటపడి ప్రగతిభవన్ కట్టించుకున్నారు. శుత్రుదుర్భేధ్యంగా తయారు చేసి.. హైదరాబాద్ నడి బొడ్డున గడీలాగా దాన్ని మార్చేశారు. ఎవర్నీ లోపలికి అడుగుపెట్టనీయలేదు. అప్పట్లో ఈ భవన్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజరిక భవనంలాగా నిర్మించారని మండిపడ్డారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. తమది ప్రజాపాలన అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. రాజుల కాలాన్ని గుర్తు చేస్తున్న ప్రజాభవన్ లో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే మాజీ సీఎం కేసీఆర్.. ఈ బిల్డింగ్ ను ఖాళీ చేశారు. కానీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ లోని సొంత ఇంట్లోనే ఉంటున్నారు. క్యాంపాఫీస్ కు షిప్ట్ అవ్వలేదు. దానికి బదులు.. MCR HRD ని సీఎం క్యాంపాఫీస్ మార్చుకోవాలని భావిస్తున్నారు. కేసీఆర్ ను యశోదాలో పరామర్శించిన రోజునే.. వెంటనే MCR HRD బిల్డింగ్ కి వెళ్ళి పరిశీలించారు రేవంత్. అక్కడ ప్రభుత్వ అధికారులు, ఇతర సంస్థలకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు.

MCR HRD లో నివాసం ఉండటానికి అన్ని సౌకర్యాలు ఉండటంతో భద్రతా పరంగా కూడా అనుకూలంగా ఉంది. బిల్డింగ్ ఆవరణ విశాలంగా ఉండటంతో.. పెద్ద సంఖ్యలో వెహికిల్స్ పార్కింగ్ చేసుకోడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అందుకే ఇక్కడే క్యాంపాఫీస్ ఏర్పాటు చేయడం బెటర్ అని అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి MCR HRD బిల్డింగ్ కి మకాం మారిస్తే.. అక్కడున్న శిక్షణా సంస్థను ప్రజాభవన్ కు తరలించే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో క్యాంపాఫీస్ పై ఏ నిర్ణయం అనేది తీసుకునే అవకాశముంది.