CM, Revanth Reddy : సీఎం రేవంత్ ఇక జిల్లాల టూర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక జిల్లాల టూర్ కి వెళ్ళాలని నిర్ణయించారు. పాలనా యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు కొత్త ఏడాది జనవరిలో జిల్లాలకు వెళతారు. 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల లోపే వాటిని అమలు చేయాలని రేవంత్ ఆలోచిస్తున్నారు. అందుకే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను అధికారులకు వివరించేందుకు జిల్లాల పర్యటనకు షెడ్యూల్ రెడీ అవుతోంది.

ఈ వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పూర్తవుతాయి. కొత్త స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ఉభయసభ ప్రసంగం.. తర్వాత ధన్యవాదాల తీర్మానం.. శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఇక నెక్ట్స్ వీక్ లో IAS, IPS లను పెద్ద ఎత్తున బదిలీ చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని చెబుతున్నారు. జిల్లాల్లో ఉన్న ఇబ్బందులు.. తమ ప్రభుత్వం 6 గ్యారంటీలను జనంలోకి ఎలా తీసుకెళ్ళాలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వివరించబోతున్నారు.
డిసెంబర్ 27న సింగరేణి కాలరీస్ లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. కోల్ బెల్ట్ ఏరియాలోని అసెంబ్లీ నియోజవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దాంతో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సింగరేణి ఎన్నికల ప్రచారానికి కూడా రేవంత్ వెళ్ళే ఛాన్సుంది. AICC నేత రాహుల్ గాంధీ కూడా ప్రచారానికి వస్తున్నారు. సింగరేణి ఎన్నికల్లో INTUC ని గెలిపించాలన్నది కాంగ్రెస్ ప్లాన్.
ఓవైపు ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్తూనే.. 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కూడా ఉన్న ఆయన.. జనరల్ ఎలక్షన్స్ దాకా ఆ పదవిలో కూడా కొనసాగే అవకాశాలున్నాయి. అందుకే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు 100 రోజుల్లో తమ 6 గ్యారంటీలను అమలు చేయడం, జిల్లాల పర్యటనలతో జనానికి మరింత దగ్గర అవ్వాలన్నది రేవంత్ రెడ్డి ప్రయత్నంగా కనిపిస్తోంది.