TELANGANA IAS’S: ఐఏఎస్ అధికారులా..? పార్టీ కార్యకర్తలా..? సివిల్ సర్వెంట్స్ ఇంతగా దిగజారి పోవాలా..?
కెసిఆర్ జమానాలో సోమేశ్ కుమార్, స్మితా సబర్వాల్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, రజత్ కుమార్‌లు ఏకంగా సమాంతర వ్యవస్థలనే నడిపారు. వాళ్ళు ఆడింది ఆట.. పాడింది పాట పాటగా నడిచింది. అంతేకాదు మంత్రులు ముఖ్యమంత్రులు అండ చూసుకొని వీళ్లు మిగిలిన అధికారులను వణికించారు.

TELANGANA IAS’S: తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలక పార్టీ కార్యకర్తల్లా మారిపోతున్నారు. అసలు వీళ్ళ ముందు పార్టీ క్యాడర్ కూడా దిగదుడుపే. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులుగా ప్రమాణం చేసి, ప్రజల కోసం పనిచేస్తామని, సమర్థ కార్య నిర్వహణ తమ లక్ష్యం అని చెప్పుకునే అధికారులు.. ప్రభుత్వాలు రాగానే నేతలతో కుల సమీకరణాలు, పూర్వ స్నేహాలు, రికమండేషన్లు.. ఇలా రకరకాల దారుల్లో ముఖ్యమంత్రి, మంత్రుల ఆఫీసుల్లో తిష్ట వేస్తున్నారు. అక్కడ వీళ్ళ హవా మామూలుగా ఉండదు.
DSP NALINI: డీఎస్పీ ఉద్యోగం వద్దంటున్న నళిని.. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే..
కెసిఆర్ జమానాలో సోమేశ్ కుమార్, స్మితా సబర్వాల్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, రజత్ కుమార్‌లు ఏకంగా సమాంతర వ్యవస్థలనే నడిపారు. వాళ్ళు ఆడింది ఆట.. పాడింది పాట పాటగా నడిచింది. అంతేకాదు మంత్రులు ముఖ్యమంత్రులు అండ చూసుకొని వీళ్లు మిగిలిన అధికారులను వణికించారు. సోమేశ్ కుమార్ బరితెగింపు ఎంతగా ఉండేది అంటే.. న్యాయస్థానం ఆయన్ని ఆంధ్ర క్యాడర్ అధికారిగా గుర్తిస్తూ ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాలని ఆదేశిస్తే ఏపీకి వెళ్లి కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉండి, ఉద్యోగానికి రాజీనామా చేసి మరుసటి రోజు తిరిగి వచ్చి కెసిఆర్ సర్కారులో సలహాదారుగా చేరారు. ఇలాంటి అధికారిని పార్టీ కార్యకర్తగా కాక ఎలా చూడాలి..? టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పాత్ర పోషించిన స్మిత సబర్వాల్ కనీసం మర్యాదపూర్వకంగా కూడా తాజా ముఖ్యమంత్రిని కలవలేదు. ఇరిగేషన్ మీద రివ్యూ మీటింగ్ జరిగితే హాజరు కాలేదు. అంతవరకు ఎందుకు విద్యుత్ శాఖ మీద రివ్యూ జరిగితే ఆ శాఖ సీఎండీ ప్రభాకర్ రావు తాను ముఖ్యమంత్రి మీటింగ్‌కు రానని తెగేసి చెప్పేశారు.
Parliament Attack: పార్లమెంటుకే భద్రత లేదా? మరి సామాన్యుల సంగతేంటి..?
వీళ్లు తమని పార్టీ ప్రతినిధులుగానే భావిస్తున్నారు తప్ప ప్రభుత్వ అధికారులుగా గాని, ప్రజలకు జవాబుదారులుగాగాని భావించడం లేదు. అంటే అధికారుల్లోనే టిఆర్ఎస్ అధికారులు, కాంగ్రెస్ అధికారులుగా రెండు వర్గాలుగా ఉంటారన్నమాట. కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎంతగా బరితెగిస్తారంటే ఎన్నికల్లో పార్టీ పనులు, డబ్బు పంపిణీ కూడా వీళ్లే భుజాలకి ఎత్తుకుంటారు. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. ఆంధ్రాలో పరిస్థితి ఇంతకన్నా దారుణం. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి మేలు చేసి జైలు పాలైన సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, జగన్ అధికారంలోకి రాగానే నేరుగా ఆయన ఆఫీసులో చేరిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులంతా వైసిపి కార్యకర్తలులాగే పని చేస్తారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అయితే పార్టీలోనే కాదు సీఎం కుటుంబంలో కూడా ఒక వ్యక్తిగానే ఉంటారు.
చంద్రబాబు హయాంలో కూడా అధికారులు తక్కువ ఏం తినలేదు. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, అన్నీ తానై వ్యవహరించేవాడు. ప్రిన్సిపల్ సెక్రెటరీ సతీష్ చంద్ర కూడా అప్పట్లో టిడిపి కార్యకర్తలానే ఉండేవారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించడం, మరో పార్టీ అధికారంలోకి రాగానే సెలవులు పెట్టి పారిపోవడం లేదా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం ఐఏఎస్‌లకి, ఐపీఎస్‌లకి అలవాటైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టిందో.. కార్యనిర్వహక వ్యవస్థ కూడా అంతకుమించి భ్రష్టు పట్టిపోయింది.